40.2 C
Hyderabad
April 29, 2024 18: 57 PM
Slider ముఖ్యంశాలు

పోలీస్ టీ20: నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్…!

#PoliceT20

విజయనగరం విజ్జి స్టేడియం లో విజయనగరం సివిల్ విభాగానికి చెందిన “సివిల్ వారియర్స్” చింతలవలస 5th బెటాలియన్ కి చెందిన “బెటాలియన్ రైఫిల్స్” మధ్య క్రికెట్ మ్యాచ్ రసవత్తరం గా సాగింది. నిరంతర విధులు, ఒత్తిడి నుండి ఉపశమనం పొందేందుకు జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఆధ్వర్యంలో సివిల్ విభాగానికి చెందిన పోలీసు అధికారులు “సివిల్ వారియర్స్” , చింతలవలస 5th బెటాలియన్ కమాండెంట్ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో బెటాలియన్ పోలీసు అధికారులు “బెటాలియన్ రైఫిల్స్” గా క్రికెట్ పోటీలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, జిల్లా పరిషత్ చైర్మెన్ మజ్జి శ్రీనివాసరావు పాల్గొని, క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకరు మాట్లాడుతూ నిరంతరం విధులను నిర్వహిస్తూ, ఎంతో ఒత్తిడి గురయ్యే పోలీసులు, ఉపశమనం పొందేందుకు జిల్లా ఎస్పీ, కమాండెంట్ మంచి ఆలోచనతో పోలీసు అధికారుల్లో ఉత్సాహాన్ని, క్రీడా స్ఫూర్తిని నింపారన్నారు.

జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏడాదిపాటు ఎంతో క్రమశిక్షణతో విధులు నిర్వహించి, కొత్త ఉత్సాహంతో నూతన సంవత్సరంలో కూడా పని చేసే విధంగా పోలీసు అధికారుల్లో ఉత్సాహాన్ని, ఆనందాన్ని నింపేందుకు ఎస్పీ, కమాండెంట్ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారన్నారు. టాస్ గెలిచి బ్యాటింగు ఎంచుకున్న సివిల్ వారియర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లును కోల్పోయి 182 పరుగులు సాధించారు. బ్యాటింగులో ఎస్ఐ లక్ష్మణ్ రాణించి ఒక సిక్స్, ఆరు ఫోర్లతో 33పరుగులు సాధించగా, ఎస్ఐ నవీన్ పడాల్ 4 ఫోర్లు, ఒక సిక్స్ తో 28పరుగులు చేయగా, ఎస్ఐ వాసుదేవ్ 20పరుగులు చేసారు. బెటాలియన్ రైఫిల్స్ జట్టులో ఆర్.ఎస్.ఐ.

కృష్ణారావు 4 వికెట్లును పడగొట్టారు. 183 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగు ప్రారంభించిన బెటాలియన్ రైఫిల్స్ చివర బంతి వరకు పోరాడి, 3 వికెట్లుతో విజయం సాధించింది. కమాండెంట్ విక్రాంత్ పాటిల్ బ్యాటింగ్, బౌలింగ్ చేసి, బ్యాటింగ్ లో 10 పరుగులు, బౌలింగ్ లో ఒక వికెట్ సాధించారు. ప్రొఫెషనల్ క్రికెట్ ను తలపించిన మ్యాచ్ లో ఆధ్యంతం ఆసక్తికరంగా మ్యాచ్ రెండు వైపులా మొగ్గుతూ, చివరి బంతి వరకు ఉత్కంఠను నింపింది. బెటాలియన్ రైఫిల్స్ జట్టులో ఆర్.ఎస్.ఐ. సురేష్ 2 సిక్స్ లు, 3 ఫోర్లుతో 39 పరుగులు చేయగా, ఆర్.ఎస్.ఐ. శివ ప్రసాద్, ఆర్.ఐ. రవీంద్ర కుమార్ చక్కటి సహకారాన్ని అందిస్తూ చెరో 22 పరుగులు చేసి, విజయంలో కీలకపాత్ర పోషించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ – నూతన సంవత్సర ప్రారంభానికి ముందు జిల్లా పోలీసు శాఖ, బెటాలియన్ అధికారుల్లో ఈ క్రికెట్ మ్యాచ్ మంచి ఉత్సాహాన్ని నింపిందన్నారు. ఇరు జట్లకు చెందిన అధికారులు చక్కని క్రీడా స్ఫూర్తితో మంచి ప్రతిభను కనబర్చారని, ఇదే స్ఫూర్తితో రాబోయే రోజుల్లో కూడా సమిష్టిగా పని చేసి, శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయాలని పోలీసు అధికారులు, సిబ్బందిని కోరారు. 5th బెటాలియన్ కమాండెంట్ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ క్రీడల్లో సాధారణంగా ఒకరే విజేతగా నిలుస్తారని, కానీ, ఇరు జట్లు మంచి స్ఫూర్తితో క్రికెట్ ఆడాయని, ఉమ్మడిగా పోలీసులు విజేతలుగా నిలిచారన్నారు.

భవిష్యత్తులో అధికారులు, సిబ్బందిలో చైతన్యం, స్ఫూర్తిని నింపేందుకు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు. విజయనగరం పోలీసు కప్ – 2022 విజేతగా నిలిచిన బెటాలియన్ రైఫిల్స్ జట్టుకు విన్నర్స్ ట్రోఫీని, రన్నర్స్ ట్రోఫీని, మెడల్స్ ను కమాండెంట్ విక్రాంత్ పాటిల్, జిల్లా ఎస్పీ ఎం. దీపిక అందజేసారు. ఈ క్రికెట్ మ్యాచ్ లో అసిస్టెంట్ కమాండెంట్ పద్మనాభ రాజు, విజయనగరం ఇన్చార్జ్ డిఎస్పీ ఆర్.శ్రీనివా రావు, సీఐలు జి. రాంబాబు, జె.మురళి, బి.వెంకటరావు, లక్ష్మణరావు, విజయనాధ్, ఎం.శేషు, సింహాద్రి నాయుడు, ఆర్ఎస్ఐలు, పలువురు ఎస్ఐలు, ఆర్ఎస్ ఐలు పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

అమ్మాయిలు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్ళాలి

Satyam NEWS

రెండో అధికార భాష గా ఉర్ధూ

Sub Editor 2

అధిక ఫీజులు వసూలు చేస్తున్న స్కూళ్లపై చర్య తీసుకోవాలి

Satyam NEWS

Leave a Comment