29.7 C
Hyderabad
April 29, 2024 08: 55 AM
Slider జాతీయం

కొత్త చట్టం లో శిక్షలు తప్పవు …మైనర్లను రేప్ చేస్తే ఇక ఉరే

#central government

బ్రిటిష్ కాలం నాటి ఇండియన్ క్రిమినల్ చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలను సుకురాబోతున్నది.నేరాలకు శిక్షలను మరింత కఠిన తరం చేస్తూ ఐపీసీ (ఇండియన్ పీనల్ కోడ్), సీసీపీ (కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్), ఐఈఏ (ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్) స్థానంలో వేరే నూతన చట్టాలను తీసుకురాబోతున్నది. ఈ మేరకు భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత-2023, భారతీయ సాక్ష్య బిల్లు-2023 పేరుతో కొత్త బిల్లులను శుక్రవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్ సభలో ప్రవేశపెట్టారు.

మూడు బిల్లులను లోక్ సభ స్థాయి సంఘం పరిశీలనకు పంపింది.బిల్లులను సభలో ప్రవేశ పెడుతున్న సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ‘శిక్ష వేయడం కాదు.. న్యాయం అందించడం ఈ కొత్త చట్టాల లక్ష్యం’ వీటి ద్వారా 90 శాతంపైగా నేరగాళ్లకు శిక్షలు పడతాయని ఏడేళ్లకు పైగా శిక్షపడే కేసుల్లో ఫోరెన్సిక్ తనిఖీలు తప్పనిసరి స్తున్నామన్నారు.నేరాలను అరికెట్టించేలా కొత్త చట్టంలో శిక్షలు ఉంటాయని చెప్పారు. ఈ మూడు చట్టాలు భారతీయ పౌరుల హక్కులను పరిరక్షిస్తాయని వ్యాఖ్యానించారు.

అత్యాచారం చేస్తే ఉరే మైనర్లపై అత్యాచారానికి పాల్పడితే ఉరిశిక్ష విధించేలా కొత్త చట్టాలు తీసుకువచ్చారు. సామూహిక అత్యాచారానికి పాల్పడితే 20 ఏళ్ల జైలు, 7 సంవత్సరాలకు పైగా శిక్ష విధించే కేసుల్లో ఫోరెన్సిక్ సాక్ష్యాలు తప్పనిసరి, మూక దాడులకు ఏడేళ్ల జైలు శిక్ష, వరకట్న వేధింపుల ద్వారా జరిగే మరణానికి 7 సంవత్సరాల జైలు శిక్ష.

ఇది జీవితాంతం జైలు శిక్షగా పొడిగించే ఛాన్స్, ఎక్కడి నుంచైనా ఈ-ఎఫ్ఐఆర్ నమోదుకు ఛాన్స్, సెర్చ్ ఆపరేషన్ చేస్తే సెర్చ్ వారెంట్ తో పాటు ఎవరి వద్దకైనా వెళ్తే వీడియో గ్రఫీ, ఎఫ్ఐ ఆర్ నుండి ఛార్జిషీట్ వరకు అన్ని డిజిటలైజేషన్ చేయడం వంటి ముఖ్యమైన మార్పులు కొత్త బిల్లుల్లో ఉన్నాయి. అలాగే దావూద్ ఇబ్రహీం వంటి పరారీలో ఉన్న నేరస్థులను గైర్హాజరీలో విచారించేందుకు నిబంధన తీసుకొచ్చారు.

Related posts

వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు!

Bhavani

ఎమ్మెల్యే మేడా ని విమర్శిస్తే తీవ్ర పరిణామాలు

Satyam NEWS

పోలీసులు ఆపారని స్కూటీ కి నిప్పు

Bhavani

Leave a Comment