23.7 C
Hyderabad
May 8, 2024 05: 33 AM
Slider ఖమ్మం

లక్ష్యాలను నిర్ణిత వ్యవధిలోగా పూర్తి చేయాలి

#bankers

బ్యాంకులకు నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణిత వ్యవధిలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి సమావేశ మందిరంలో అధికారులు, బ్యాంకర్లతో కలెక్టర్ డిఎల్ఆర్ సి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో బ్యాంకుల్లో రూ. 8,936.50 కోట్ల డిపాజిట్లు, రూ. 15,322.24 ల అడ్వాన్సులు ఉన్నట్లు తెలిపారు. 2022-23 సంవత్సరానికిగాను స్వల్పకాలిక పంట రుణాల క్రింద రూ. 2,887 కోట్ల లక్ష్యానికి గాను, రూ. 2,434 కోట్లు, ఏజిజి టర్మ్ లోన్ల క్రింద రూ. 768 కోట్ల లక్ష్యానికి గాను రూ. 1,206 కోట్లు, అగ్రి ఇన్ఫ్రా క్రింద రూ. 164 కోట్ల లక్ష్యానికి గాను రూ. 30 కోట్లు, అనుబంధ రంగాలకు రూ. 780 కోట్ల లక్ష్యానికి గాను రూ. 161 కోట్ల ప్రగతిని, మొత్తంగా వ్యవసాయానికి రూ. 4,599 కోట్ల లక్ష్యానికి గాను రూ. 3,831 కోట్ల ప్రగతి సాధించినట్లు తెలిపారు. ఎంఎస్ఎంఇ క్రింద రూ. 518 కోట్ల లక్ష్యానికి రూ. 1,000 కోట్లు, విద్యా రుణాల రూ. 190.96 కోట్ల లక్ష్యం ఉండగా రూ. 20 కోట్లు, హౌజింగ్ రుణాల క్రింద రూ. 446 కోట్ల లక్ష్యానికి గాను రూ. 57 కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాలకు రూ. 47 కోట్ల రుణాల లక్ష్యానికి గాను రూ. 93 కోట్లు, మొత్తంగా రూ. 5,801 కోట్ల రుణ వితరణ లక్ష్యానికి గాను రూ. 5,001 కోట్ల ప్రగతిని సాధించినట్లు ఆయన అన్నారు. ప్రాధాన్యత లేని రంగాలకు రూ. 169 కోట్ల రుణాల అందజేత లక్ష్యానికి గాను రూ. 2,719 కోట్ల ప్రగతిని సాధించినట్లు ఆయన తెలిపారు. బలహీన వర్గాలకు రుణాల అందజేతకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదార్లకు రుణాలు అందజేయాలన్నారు. రైతులకు బ్యాంకుల ద్వారా అందించే పంట రుణాలు సకాలంలో అందించి వారికి చేయూతను అందించాలని ఆయన తెలిపారు. భూ రికార్డులు లేని చిన్న సన్నకారు రైతులను గుర్తించి, వారికి రుణాలు అందించుటకు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రభుత్వ జీవో నెం. 58 ద్వారా క్రమబద్దీకరణ చేయబడి పట్టాలు పొందిన వారికి గృహ నిర్మాణ రుణాలు అందించాలన్నారు. సబ్సిడీ రుణాల గ్రౌండింగ్ త్వరితగతిన చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక కమిటీ సమావేశాల్లో బ్యాంకర్లు తప్పనిసరిగా పాల్గొనాలన్నారు. బ్యాంకర్ల నుండి పెండింగ్ యుసి లను వెంటనే సంబంధిత శాఖలకు పంపాలన్నారు.  బ్యాంక్ లింకేజీ క్రింద స్వయం సహాయక సంఘాలకు రుణాల లక్ష్యాన్ని వచ్చే మహిళా దినోత్సవం లోగా పూర్తి చేయాలన్నారు. క్రొత్త ఆసరా పెన్షన్లు మంజూరు అయి, ఆధార్ తదితర సమస్యలతో పంపిణీ కాకుండా ఉన్నాయని, వెంటనే సమస్య పరిష్కరించాలని అన్నారు.  ప్రజల్లో ఆర్థిక అక్షరాస్యతకై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు.

Related posts

పెద్ద మనసును చాటుకున్న రవాణా మంత్రి పువ్వాడ

Satyam NEWS

బహుజన గర్జనను జయప్రదం చేయండి

Satyam NEWS

చైత్రోదయం

Satyam NEWS

Leave a Comment