38.2 C
Hyderabad
May 5, 2024 20: 33 PM
Slider అనంతపురం

పత్రికా విలేకరులను బూతులు తిడుతున్న వైసీపీ ఎమ్మెల్యే

#journalists


మీడియా, పత్రిక విలేకరులపై చెప్పరాని భాషలో బూతులు తిడుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రభుత్వ విప్, రాయదుర్గం శాసనసభ్యులు కాపు రామచంద్రారెడ్డి బే షరతు గా క్షమాపణ చెప్పాలనీ ఏపీయూడబ్ల్యూజే(ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) డిమాండ్ చేసింది. యూనియన్ జిల్లా కన్వీనర్ పయ్యావుల ప్రవీణ్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా ఎస్పీ శ్రీనివాసరావును కలిసి ఎమ్మెల్యే తీరుపై ఫిర్యాదు చేశారు.

విప్ కాపు విలేఖరులను లక్ష్యంగా చేసుకొని కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఈ నెల 26న రాయదుర్గం R&B అతిథి గృహంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడిన వీడియోను చూపారు. బొమ్మనహాళ్ ఆంధ్రజ్యోతి విలేఖరి మహేష్, టీవీ5 రిపోర్టర్ గురు రాఘవేంద్ర లపై పోలీస్ స్టేషన్ లో ఆయన అనుచరుల ద్వారా తప్పుడు ఫిర్యాదులు చేయించారన్నారు.

మహా న్యూస్ రిపోర్టర్ ఆనంద్ భార్య కనేకల్ మండలంలోని బ్రహ్మసముద్రం లో టీచరుగా పనిచేస్తున్న శారదా పద్మావతి పై అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేయించారన్నారు. బొమ్మనహాల్ ఈనాడు విలేఖరి వెంకటేశులపై ఇంటి వద్దకు కబ్జా చేశారని ఎమ్మెల్యే అనుచరులతో అధికారులకు ఫిర్యాదులు చేయించారన్నారు. కొంతకాలంగా ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి విలేకరులను టార్గెట్ చేసి బెదిరిస్తున్నారనీ.

విలేఖర్ల తో పాటు వారి కుటుంబ సభ్యులు, యాజమాన్యాలను కలిపి దుషిస్తున్నారాన్నారు. అంతకు ముందు అనేక సార్లు ప్రభుత్వ కార్యక్రమాలను కవర్ చేయడానికి వెళ్లిన రిపోర్టర్ల పై బెదిరింపులకు పాల్పడ్డారని చెప్పారు. ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి తీరును ఏపీయూడబ్ల్యూజే(ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్) తీవ్రంగా ఖండిస్తోందని యూనియన్ నేతలు తెలిపారు. రాయదుర్గం నియోజకవర్గం లో పాత్రికేయులకు ఆయన తో పాటు ఆయన అనుచరుల నుంచి ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

అక్కడ పనిచేసే రిపోర్టర్లకు భవిష్యత్తులో ఏదైనా అపాయం జరిగితే ప్రభుత్వ కాపు రామచంద్రారెడ్డి పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. దురుద్దేశంతో విలేకరులపై చేసిన తప్పుడు ఫిర్యాదులను పూర్తిస్థాయిలో విచారించి అక్రమ కేసులు బనాయించ కుండా చర్యలు తీసుకోవడం తో పాటు… ఎమ్మెల్యే గా… ప్రభుత్వ విప్ గా ఉంటూ రిపోర్టర్లు బెదిరిస్తూ… భయబ్రాంతులకు గురి చేస్తున్న కాపు రామచంద్రారెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్ పీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో iju సభ్యులు ప్రభాకర్ నాయుడు, కో కన్వీనర్ షేక్ మహమ్మద్ ఆయుఫ్, కమిటీ సభ్యులు చౌడప్ప, పూల చలపతి, పట్టుపోగుల రామాంజినేయులు, ఆంధ్ర జ్యోతి భ్యురో రామకృష్ణుడు, ఈనాడు, ఈటీవీ ప్రతినిధులు అంజప్ప, లక్ష్మీ ప్రసాద్, tv 5 స్టాఫర్ చంద్రశేఖర్, ఏబీఎన్ స్టాఫర్ సురేష్ ,రాజ హాన్నుర్, తదితరులు పాల్గొన్నారు

Related posts

గొర్రెలు కాస్తున్న ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లు

Satyam NEWS

ప్రకృతి రమణీయతకు అద్దం…అరకు లో రాయల్ రిసార్ట్స్ అందం…!

Bhavani

నాణ్యమైన ,రుచికరమైన ఆహార పదార్దాలను ప్రజలకు అందించాలి

Sub Editor 2

Leave a Comment