కడప జిల్లా పులివెందులలో అర్ధరాత్రి రెండు దేవాలయాల్లో దోపిడీ జరిగింది. రెండు దేవాలయాల్లో దొంగలు స్వైర విహారం చేశారు. రెండు ఆలయాలలో హుండీలను పగులగొట్టి ఉన్న సొమ్మును దొంగలు దోచుకెళ్లారు. పులివెందులలోని పాత మార్కెట్ లో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం, సాయిబాబా ఆలయాల్లో తలుపులకు తాళాలు పగులగొట్టి దొంగలు లోపలికి ప్రవేశించారు. హుండీలను పగులగొట్టి డబ్బులు పలురకాల వస్తువులను దొంగలు దోచుకు వెళ్లారు. సాయిబాబా ఆలయంలో సుమారు 4లక్షలు పైగా విలువచేసే వెండి ఆభరణాలు, వస్తువులను దోచుకున్నారు. ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
