21.7 C
Hyderabad
December 2, 2023 03: 51 AM
Slider ఖమ్మం

పువ్వాడకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సిపిఐ నేతలు

#CPI leaders

సీపీఐ సీనియర్ నాయకులు, మాజీ శాసన సభ్యులు పువ్వాడ నాగేశ్వరరావుకు సిపిఐ నేతలు ఆయన ఇంటి వద్ద కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పువ్వాడ నాగేశ్వరరావు ఆయన సతీమణి పువ్వాడ విజయలక్ష్మి కి ఈ సందర్భంగా వైవాహిక జీవిత శుభాకాంక్షలు తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఖమ్మంజిల్లా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన సున్వాడ 85వ జన్మదినోత్సవం జరుపుకోవడం అత్యంత సంతోషకరమన్నారు.

నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించి ప్రజా ఉద్యమాలకు దన్నుగా నిలవాలని ఆకాంక్షించారు. పువ్వాడకు ప్రత్యేక అభినందనలు తెలిపిన వారిలో సిపిఐ జాతీయ సమితి సభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సహాయ కార్యదర్శి డండి సురేష్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ ఛైర్మన్ మహ్మద్ మౌలానా, రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్రెడ్డి, ఎకె జానిమియా, కొండవర్తి గోవించరావు, కార్పొరేటర్లు బిజి క్లెమెంట్, చామకూరి వెంకటనారాయణ, జిల్లా కార్యవర్గ సభ్యులు, ప్రజా సంఘాల బాధ్యులు,

జిల్లా సమితి సభ్యులు, మండల కార్యదర్శులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఖమ్మం పట్టణలకు చెందిన పలువురు పుర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, బవింపి అధ్యక్షులు బాగం కిషన్ రావుతో పాటు పలువురు వైద్యులు, వివిధ శాఖల అధికారులు, పువ్వాడ సహచరులు, బంధుమిత్రులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.

Related posts

గ్యాంగ్ లీడర్: విశాఖ నుంచి షిర్టీకి గంజాయి స్మగ్లింగ్

Satyam NEWS

మాస్కు వాడకంలో నిర్లక్ష్యం వద్దు.. కరోనాను ఆహ్వానించొద్దు

Sub Editor

ఎమర్జెన్సీ:చైనాకు అంతర్జాతీయ వైద్యనిపుణుల బృందం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!