38.2 C
Hyderabad
May 2, 2024 19: 32 PM
Slider ప్రత్యేకం

కొల్లాపూర్ టిఆర్ఎస్ పార్టీలో మూడవ వర్గం?

#jupalli

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న వర్గ రాజకీయాలు,వర్గ విభేదాలు ఏ విధంగా ఉన్నాయో పెద్దగా చెప్పనక్కర్లేదు. కేవలం టిఆర్ఎస్ పార్టీలోనే రెండు వర్గాలు ఏర్పడి నువ్వా, నేనా అనే విధంగా మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు,ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి వర్గాల మధ్య హాట్ హాట్ గా రాజకీయం జరుగుతుంది. రాష్ట్ర మీడియాలో కూడా ఇక్కడి కథనాలు ఎక్కువగా వస్తున్నాయి.

అయితే ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యలో మరొక వర్గం ఏర్పడినట్లు ప్రచారం జరుగుతుంది. టిఆర్ఎస్ పార్టీలో మరో వర్గం ఏంటని? అనుకుంటున్నారా? అవును ఇది నిజమే అని అంటున్నారు కొందరు. గత మార్చి నెలలో  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వనపర్తి బహిరంగ సభకు హాజరయ్యారు.

ఆ సందర్భంగా కొల్లాపూర్ నియోజక వర్గానికి  టిఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు  ముఖ్యమంత్రిని కలిసినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ సమయంలో  ఆయనకు ముఖ్యమంత్రి నుండి ఒక హామీ వచ్చినట్లు జోరుగా చర్చ జరుగుతుంది. అయితే ఈ ప్రచారం ఎంత వరకు నిజం అనేది తెలియదు. కానీ ప్రస్తుతం కొల్లాపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిస్థితులను చూసి అవుననే అనుకోవచ్చు.

వస్తున్న సర్వేల్లో  మరొకరికి అవకాశం కల్పించాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు కొందరు  ప్రచారం చేస్తున్నారు. సర్వే  రిపోర్ట్ కూడా ఇలాగే వచ్చిందని చర్చలు చేసుకుంటున్నారు. మరి ఆ సీనియర్ నాయకుడు ఎవరనేది తెలియాల్సి ఉంది. అయితే కొల్లాపూర్ నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీకి  మొదటగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర వహించారు సీనియర్ నాయకులు మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి. నియోజకవర్గంలో ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఉంది అంటే మొదటగా మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి కారణమని చెప్పవచ్చు.

ముఖ్యమంత్రితో తనకు మంచి సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది. అయితే  టిఆర్ఎస్ పార్టీలోకి అప్పటి మంత్రి జూపల్లి కృష్ణారావు రావడంతో టిఆర్ఎస్ పార్టీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బలోపేతం అయింది. ఉద్యమం ఊపందుకుంది. రాష్ట్ర నాయకులలో కదలికలు కూడా వచ్చాయి.

జూపల్లి మంత్రి పదవికి,ఎమ్మెల్యేకు కాంగ్రెస్ పార్టీకి  రాజీనామా  చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. జూపల్లి కెసిఆర్ తో కలిసి గులాబీ కండువా మెడలో వేసుకొని తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ బాటలో నడిచారు. అప్పుడే బై ఎలక్షన్ వచ్చింది. జూపల్లి టిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేశారు.

అయితే అప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీలో కొనసాగిన మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. అప్పుడు జూపల్లి కృష్ణారావు విజయ ఢంకా మోగించారు. తెలంగాణ ఉద్యమానికి ప్రజలు ఊపిరి పోశారు. అయితే జూపల్లినీ చూసి కొందరు మంత్రులు, ఎమ్మెల్యే లు కూడా అదే బాటలో నడిచారు.

ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ముమ్మాటికి నిజం. స్వయంగా అప్పట్లో కేసీఆర్ ఎన్నికల సమయంలో హాట్ కామెంట్స్ కూడా చేశారు. జూపల్లి కక్కింది  నాకడానికి వచ్చారా? అని ప్రధాన పార్టీల నాయకులను విమర్శలు చేశారు. అయితే ఆ సమయంలో టిఆర్ఎస్ పార్టీ నుండి వెళ్ళిపోయి కాంగ్రెస్ పార్టీ నుంచి  పోటీ చేసింది కూడా మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి కావడం విశేషం.

అయితే తాజాగా ఇప్పుడు నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారం ఎంత వరకు నిజం అనేది సమయం పట్టేలా ఉంది. మొత్తానికి ప్రస్తుత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి కన్నా కెసిఆర్ తో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కు, మామిళ్ళపల్లి విష్ణువర్ధన్ రెడ్డి కి ఎక్కువ రోజుల సంబంధం ఉన్నదనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే  ఈసారి ఇద్దరి మధ్యలో  మూడవ వ్యక్తికి  అవకాశం ఇస్తున్నారని ప్రచారం అయితే జోరుగా జరుగుతోంది.

మహిళలకు అవకాశం కల్పిస్తే  ఇప్పటికే టికెట్ కోసం  ఓ మహిళ నేత  కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాగాని కేవలం నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్నందున  ఇంత మంది ఆశావహులు అవకాశం కోసం ఎదురుచూస్తున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఏదేమైనా ఎన్నికలు రావడానికి సమయం ఉంది. ప్రచారమైతే ఈ విధంగా జరుగుతుంది. చూడాలి ఎలాంటి పరిణామాలు చోటచేసుకుంటాయో?

అవుట రాజశేఖర్ సత్యం న్యూస్ నెట్   కొల్లాపూర్

Related posts

డిజిటల్ మీడియా బలపడేనా?

Satyam NEWS

మంత్రులు ములుగు వస్తే ప్రజలు పోలీస్ స్టేషన్లో ఉండాలా

Satyam NEWS

రైతు వేదిక నిర్మాణానికి శంకుస్థాపన

Satyam NEWS

Leave a Comment