38.2 C
Hyderabad
May 2, 2024 22: 18 PM
Slider తెలంగాణ

మానవత్వం తలదించుకునే సందర్భం ఇది

employees

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ తాహసిల్దార్ విజయారెడ్డిని సజీవదహనం చేయడం అమానవీయమైన ఘటన మానవత్వం తలదించుకోవాల్సిన సందర్భం అని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర సమన్వయకర్త మాచర్ల రామకృష్ణ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అమానుష ఘటనను తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్  తీవ్రంగా ఖండిస్తున్నది.  దీనికి పాల్పడిన వారిని సత్వరమే గుర్తించి విచారించి కఠినమైన శిక్షలు వేయాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ఉద్యోగులకు రక్షణ కల్పించాలి ఉద్యోగులు సృహద్భావంగా వాతావరణం లో పనిచేసే పరిస్థితులు కలిగించాలి  సామాన్య ప్రజలను ఉద్యోగులపై ఉసుగొల్పుతున్న మాఫియాల పై ప్రభుత్వం ఉక్కుపాదం మోపాలని డిమాండ్ చేస్తు కొన్నిసార్లు బాద్యతాయుత స్థానాల్లో ఉన్న వారు ఉద్యోగుల పై చేస్తున్న చౌకబారు వ్యాఖ్యలు ఇలాంటి పైశాచిక అకృత్యాలకు దారితీస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన సాదా బై నామాలు ఆర్ ఓ ఆర్ వంటి రెవెన్యూ సంస్కరణలు,అందులోని కొన్ని సాంకేతిక అంశాల కారణంగా కొద్ది మంది పిటిషన్ దారులకు సత్వర న్యాయం జరగక ఇబ్బందులు ఎదురవుతున్నది. క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం కావడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. ఇక నైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉద్యోగ సంఘ నాయకులతో చర్చించి ప్రజల సమస్యలకు సుళువైన పరిష్కారాలు లభించే విధంగా విధి విధానాల రూప కల్పన జరగాలి.  ప్రభుత్వం రూపోందించే విధానాలను రాజ్యాంగ లక్ష్యాలు అమలు చేసే ఉద్యోగులను ప్రజలు శత్రువులుగా భావించే స్థితి తొలగాలి అని ఆయన అన్నారు.

Related posts

… అందుకే సెలైన్ బాటిల్ పెట్టుకుని మరీ డబ్బింగ్ చెప్పా

Satyam NEWS

మహిళల పక్షపాతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

Satyam NEWS

హీరో నాని ఇల్లు, ఆఫీస్ పై ఐటీ దాడులు

Satyam NEWS

Leave a Comment