టాలీవుడ్ ప్రముఖులే టార్గెట్ గా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం నుంచి పలువురు నిర్మాతలు, దర్శకులు, హీరోల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. రామానాయుడు స్టూడియోతో పాటు, సురేష్ ప్రొడక్షన్ కార్యాలయంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో హీరో నానిపై కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ లోని నాని నివాసం, కార్యాలయంలో ఐటీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నారు. ఐటీ దాడుల నేపథ్యంలో టాలీవుడ్ ఒక్కసారిగా షాక్ కు గురైంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
next post