23.7 C
Hyderabad
May 8, 2024 03: 39 AM
Slider ప్రకాశం

ఈ సినిమా థియేటర్ కు ఒక ప్రత్యేకత ఉంది…..

#prakashamdist

ప్రకాశం జిల్లా వేటపాలెం గ్రామపంచాయతీ  పరిధిలో ప్రస్తుతం ఒక థియేటర్  నడుస్తున్నది. గతంలో ఈ ధియేటర్ ను రామకృష్ణ థియేటర్ అని పిలిచేవారు. ఇటీవల ఈ దియేటర్ ను రెండు థియేటర్లు గా రీమోడలింగ్ జరిగిన  సందర్భంగా మల్టీప్లెక్స్ థియేటర్ గా వ్యవహారంలో ఉన్నది.

ప్రస్తుతం PR & SR CINIMAS పేరుతో పిలువబడుతున్నది.  అయితే, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం సినిమా హాళ్ళ నిర్వహణపై అనేక మార్గదర్శకాలను అమలు చేస్తున్న పరిస్థితులలో గ్రామపంచాయతీ పరిధిలోని మల్టీప్లెక్స్ థియేటర్స్ లలో టికెట్ల ధరలు రూ. 80/-, 50/-, 30/- లు వుండగా ఈ థియేటర్లో మాత్రం ప్రభుత్వ అధికారులు రూ.100/- లు గా నిర్ణయించడం పలు అనుమానాలకు తావిస్తోంది.  అంతేకాకుండా సినిమా థియేటర్స్ లలో  మొత్తం సీట్ల వివరాలు, రేట్ల వివరాలు బోర్డులో ప్రకటించాల్సి ఉండగా,థియేటర్ యాజమాన్యం నియమ నిబంధనలను పాటిస్తున్న దాఖలాలు ఏమాత్రం లేదు.  పైగా  యజమాన్యం వారు రెవెన్యూ అధికారులకు ఇస్తున్న మామూళ్ల కారణంగా థియేటర్ నిర్వహణ సక్రమంగా లేకపోయినప్పటికీ పట్టించుకునే నాధుడు లేడు.

Related posts

పశ్చిమగోదావరిలో బీఎస్ఎన్ఎల్ ఐపీటీవీ సర్వీసు ప్రారంభం

Satyam NEWS

ఎదురు కాల్పుల్లో ఒక మహిళా నక్సలైట్ మృతి

Satyam NEWS

ఖాకీల్లో తొణికిన మానవత్వం: హ్యేట్సాఫ్ చెబుతున్న సత్యం న్యూస్. నెట్!

Satyam NEWS

Leave a Comment