37.2 C
Hyderabad
May 2, 2024 12: 15 PM
Slider ప్రత్యేకం

పట్టిసీమ ను విమర్శించిన వారే వాడుతున్నారు…

#Chandrababu

చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు నిర్మించిన పట్టి సీమ ప్రోజెక్టు పై అప్పటి ప్రతిపక్ష నేత జగన్ ఇప్పుడు అదే ప్రోజెక్టు తో రైతులకు నీళ్లు ఇవ్వాల్సి పరిస్థితి ఏర్పడింది.

పోలవరం ప్రాజెక్టు ఆలస్యం అవుతుందన్న ఉద్దేశ్యంతో, పట్టిసీమను ప్రారంభించి కుడి కాలువ ద్వారా కృష్ణాకు నీళ్లివ్వడానికి చంద్ర బాబు నాయుడు గతంలో పని ప్రారంభించారు. 2015లో ట్రయల్ రన్‌లో భాగంగా 8.8 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు ఎత్తిపోయడం వల్ల డ్రై స్పెల్ సమయంలో రూ.2,500 కోట్ల విలువైన పంటలు ఆదా అయ్యాయి.

చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సీమ ప్రజలకి ఈ ప్రాజెక్ట్ ద్వారా పంటపొలాలకు నీరు అందెంచే ప్రయత్నం చేసారు. జగన్ అదొక పనికి రాని ప్రాజెక్ట్ అని వ్యాఖ్యానించారు. ఆ ప్రాజెక్ట్ పేరు చెప్పి వేల కోట్ల స్కాం చేసారని టీడీపీని దుయ్యబట్టారు. అయితే ఈ మధ్య కాలంలో వర్షాలు అంతంత మాత్రమే ఉండటం వల్ల తప్పని పరిస్థితిలో పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పండింది.

పట్టిసీమ ప్రాజెక్ట్ ఎవరికి ఉపయోగంగా లేదు, ఈ ప్రాజెక్ట్ ఎందుకు నిర్మించారో కూడా అర్ధం కాదు అని చంద్రబాబు మీద జగన్ దుమ్మెత్తి పోశారు. అవినీతి ప్రాజెక్ట్ అని, ఇలా వాళ్ళ నోటికి తోచింది మాట్లాడారు. జగన్ ముఖ్యమంత్రి అయి నాలుగేళ్లు గడుస్తున్నా, అక్కడి నుండి చుక్క నీరు కూడా పంపింగ్ చేసే ప్రయత్నం చేయలేదు. ప్రస్తుతం వర్షాలు సరిగా పడకపోవడం, వరదలు రాకపోవడం వల్ల, పట్టిసీమ మోటర్లను తప్పని పరిస్థితుల్లో ఆన్ చేయాల్సిన సమయం వచ్చింది.

అవినీతి ప్రాజెక్ట్ అని, ఎవ్వరి కి ఉపయోగం కాదు అన్నా జగన్, ఇప్పుడు పట్టిసీమ నుండి నీళ్లు తెప్పించే పరిస్థితి ఏర్పడింది. చంద్రబాబు నాయుడు ఏది చేసిన అది ప్రజలకోసమే తప్ప స్వప్రయోజనాలకోసం మాత్రం కాదని హితవు పలికాడు. ప్రజల భవిష్యత్తు అవసరాల దృష్ట్యా పట్టిసీమ ప్రాజెక్టుని నిర్మించాం అని చంద్రబాబు నాయుడు సీఎం జగన్ కి చురకలంటించారు. నీ హయాంలో ఒక్క కొత్త ప్రాజెక్ట్ అయిన నిర్మించావా? అని ప్రజల ముంది సీఎం జగన్ దోషిగా నిలబడాల్సిందే అని చంద్రబాబు నాయుడు అన్నారు.

ఏది అబద్దమో, ఏది స్కామ్? ఏది అవినీతో ? కాలమే నిర్ణయిస్తుంది అని ప్రోజెక్టుల టూర్ లో అసలు నిజాలు బయట పెట్టారు చంద్రబాబు నాయుడు. దీంతో జగన్ చేసేదేం లేక చంద్రబాబు నాయుడు అడుగుతున్న ప్రశ్నలకి సమాధానం చెప్పలేక నానా అవస్థలు పడుతున్నారు.

Related posts

వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలి

Satyam NEWS

యూకే లో మంత్రి కేటీఆర్ పర్యటన

Bhavani

కేంద్ర ఉద్యోగులకు పెన్షనర్లకు షాక్ ఇవ్వడం అన్యాయం

Satyam NEWS

Leave a Comment