30.7 C
Hyderabad
April 29, 2024 03: 24 AM
Slider ప్రత్యేకం

కమలనాథులకు షాక్ ఇచ్చిన ‘జన’ శ్రేణులు

#PawanKalyan

తిరుపతి పార్లమెంటుకు బిజెపి అభ్యర్ధి పోటీ చేస్తారా? జనసేన అభ్యర్ధి రంగంలో దిగుతారా? ఇది తేల్చుకోలేకే గత వారం రోజులుగా రెండు పార్టీలూ మల్లగుల్లాలు పడుతున్నాయి. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్ధి పోటీ చేస్తారని ఆ పార్టీ ఏక పక్షంగా ప్రకటించడంతో జనసేన అడ్డం తిరిగింది.

ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై లాలూచీ కుస్తీ పడుతున్న బిజెపి ఇప్పుడు ఇలా ఏకపక్షంగా వ్యవహరించడాన్ని జనసేన క్షేత్ర స్థాయి కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. బిజెపి అగ్ర నేతలు రోజుకో మాట మాట్లాడటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై శక్తి మేరకు పోరాటం చేయకపోవడంపై జన సేన తీవ్ర ఆగ్రహంతో ఉంది.

శ్రేణులకు సర్దిచెబుతున్న పవన్ కల్యాణ్

ఈ విషయంపై సర్ది చెప్పేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా శ్రమించాల్సి వస్తున్నది. అంతర్గత సమావేశాలలో బిజెపి అనుసరిస్తున్న వైఖరిపై జనసేన నాయకులు తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న పోరాటాలకు జనసేన కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు అవుతుంటే బిజెపి నాయకులు వచ్చి ఫొటోలకు ఫోజులు ఇచ్చి వెళుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.

జనసేన ఎన్నో త్యాగాలు చేస్తున్నా బిజెపి నాయకులు గుర్తించనట్లు నటిస్తుండటం తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తున్నది. ఈ దశలో తిరుపతి ఎన్నికలలో మేమే పోటీ చేస్తాం అంటూ బిజెపి ప్రకటించడం పుండుపై కారం చల్లినట్లగా మారింది. జరిగేది పార్లమెంటు ఎన్నిక కాబట్టి తమది జాతీయ పార్టీ కాబట్టి తామే పోటీ చేస్తాం అని బిజెపి చెప్పింది.

తిరుపతి అసెంబ్లీపై హామీకి బిజెపి నిరాకరణ?

కనీసం వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తిరుపతి అసెంబ్లీ సీటును జనసేనకు ఇస్తామని ప్రకటించాలని జనసేన నాయకులు కోరారు. అయితే అందుకు బిజెపి సమ్మతించలేదు. అసెంబ్లీ ఎన్నికల విషయంపై ఇప్పటి నుంచే హామీలు ఇవ్వడం కుదరదని వారు వెల్లడించారు.

దాంతో జనసేన నాయకులు అన్ని విషయాలను పవన్ కల్యాణ్ ముందు ఉంచి ఏం చేయాలో మార్గనిర్దేశం చేయాలని కోరారు. బిజెపి జాతీయ స్థాయి నాయకులు తమకు పూర్తిగా అనుకూలంగా ఉన్నారని, జనసేన లీడ్ తీసుకోవాల్సిందిగా కోరుతున్నారని ఈ సందర్భంగా పార్టీ నాయకులకు పవన్ కల్యాణ్ చెప్పారు. అలాంటిది క్షేత్ర స్థాయిలో తేడా ఉండటం ఇరు పార్టీలకూ శ్రేయస్కరం కాదని ఆయన భావించారు.

తమ అభిప్రాయాలను బిజెపి రాష్ట్ర స్థాయి నాయకులకు చెప్పడంతో తిరుపతి అభ్యర్ధి ఎంపిక కథ మొదటికి వచ్చింది. తిరుపతి లోక్ సభకు బిజెపి అభ్యర్ధిని పోటీకి పెడితే కనీసం డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదని జనసేన నాయకులు కుండబద్దలు కొట్టడంతో బిజెపికి ఏం చేయాలో పాలుపోలేదు.

దాంతో మళ్లీ చర్చలు ప్రారంభించి అభ్యర్ధి ఎంపికపై మల్లగుల్లాలు పడుతున్నారు. ఉమ్మడి అభ్యర్ధి అని పైకి చెబుతున్నా ఏ పార్టీ గుర్తుపై పోటీ చేస్తారు? అనేది కీలక అంశం కావడంతో దానిపై రెండు పార్టీలూ తలలు వాచేలా ఆలోచనలు చేస్తున్నాయి. ఇప్పటికీ ఏ గుర్తుపై అభ్యర్ధిని పోటీకి నిలబెట్టాలనే అంశం తేలలేదు.

Related posts

సిందూరం సినిమా కోసం మొదటిసారి నక్సలైట్ పాత్రలో నటించా

Bhavani

విశాఖ ఉక్కు పరిశ్రమను అమ్మే హక్కు ఎవరికి లేదు

Satyam NEWS

సర్వమతాల అభివృద్దే లక్ష్యం

Murali Krishna

Leave a Comment