30.7 C
Hyderabad
April 29, 2024 06: 37 AM
Slider మహబూబ్ నగర్

పెద్దపులి సంరక్షణ తోనే పర్యావరణ సమతుల్యత

#tiger

పెద్దపులులను సంరక్షించుకావడం ద్వారానే పర్యావరణ సమతుల్యత సాధ్యమని అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అమ్రాబాద్ డివిజనల్ అధికారి విశాల్ బత్తుల, ఐఎఫ్ఎస్ అన్నారు. శనివారం అంతర్జాతీయ పెద్దపులుల దినోత్సవం సందర్భంగా .. అమ్రాబాద్ రిజర్వ్ టైగర్ అటవీ ప్రాంతంలోని అమ్రాబాద్ డివిజన్ అటవీ శాఖ ఉద్యోగులు ‘పెద్దపులిని కాపాడుదాం పర్యావరణాన్ని సంరక్షించుకుందాం’ అని గ్రామాలలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. తరువాత నిరంజన్ షావలి దర్గా నుంచి ప్రతాపరుద్ధుని కోట పై వరకు పర్యావరణ సంరక్షణలో భాగంగా ప్లాస్టిక్ సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నల్లమల్ల ప్రాంతంలో పెద్దపులుల సంఖ్య నెమ్మదిగా పెరుగుతుందన్నారు.

అటవీ సమీప గ్రామాల ప్రజలు అడవుల సంరక్షణ కోసం తమ వంతు కృషి చేయాలని అన్నారు. పెద్దపులితో పాటు ఇతర వన్యప్రాణులకు ఎవరూ హాని తలపెట్టిన అటవీ హక్కుల చట్టం ప్రకారం అవసరమైతే ఫోక్స్ కేసులు సైతం నమోదు చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు జిల్లా అటవీ శాఖ ప్లైన్స్ వద్ద అధికారి శ్రీనివాస్ దుర్వాసుల చెరువు బేస్ క్యాంపు వద్ద మొక్కలను నాటారు. ఇటీవల పర్యావరణ పరిరక్షణపై స్థానిక విద్యార్థులకు వ్యక్తిత్వ పోటీలో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో అటవీ క్షేత్ర అధికారులు ఈశ్వర్, ప్రభాకర్, సిరి గురు ప్రసాద్, సెక్షన్ బిట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నాగర్ కర్నూల్ జిల్లాలో సజావుగా నవోదయ ప్రవేశ పరీక్ష

Satyam NEWS

రైతు ఉద్యమం ఎటువైపు?

Sub Editor

హోంగార్డు అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ ఆవిష్కరించిన పోలీస్ కమిషనర్

Murali Krishna

Leave a Comment