28.7 C
Hyderabad
April 28, 2024 05: 17 AM
Slider శ్రీకాకుళం

పాఠశాలలో  కాలనిర్ణయ పట్టిక ప్రకారమే నిర్వహించాలి

#SrikakulamTown

ప్రభుత్వం ప్రకటించిన కాలనిర్ణయ పట్టిక ప్రకారమే హైస్కూళ్లు నిర్వహిస్తున్నారా? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పడం కష్టం. ఎందుకంటే ఎవరూ కాలనిర్ణయ పట్టిక అమలు చేయడం లేదు.

రాష్ట్ర ఉన్నత  విద్యాశాఖ అధికారి చినవీరభద్రుడు గత నెల అన్ని జిల్లాల  విద్యా శాఖ అధికారులను కాలనిర్ణయ పట్టిక అనుసరించాలని ఆదేశించారు. దీని ప్రకారం ఉన్నత పాఠశాల ఉదయం తొమ్మిది గంటల నుంచి పాఠశాల ప్రారంభంకావాలి.

మధ్యాహ్నం భోజన విరామ సమయమైనా  1 గంట నుంచి 1: 40 నిర్వహించాలని తెలిపారు. అదేవిధంగా పాఠశాలలో విద్యార్థులకు నీరు త్రాగేందుకు ఉదయం, మధ్యాహ్నం 10 నిమిషాలు కేటాయించ కేటాయించామని, సాయంకాలం నాలుగు గంటలకే పాఠశాలలు ముగించాలని కూడా తెలిపారు.

అదేవిధంగా విద్యార్థులకు  రెండు పూటలా  ఆనంద వేదిక కార్యక్రమం పాఠశాలలో నిర్వహించడానికి 20 నిమిషాలు కేటాయించామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా జిల్లాలో ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఈ కాలనిర్ణయ పట్టిక సరిగా అమలు పరచడం లేదని విద్యార్థులు , విద్యార్థుల తల్లిదండ్రులు నేరుగా  జిల్లా విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు.

ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు విద్యార్థుల మంచినీటి కోసం ప్రకటించే  సమయం,  ఆనంద వేదిక కార్యక్రమం కోసం ప్రకటించే సమయం తూచా తప్పకుండా  అమలు చేయవలసిందిగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు,  వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, మేధావి వర్గం ముక్తకంఠంతో కోరుతున్నారు.

Related posts

కార్మికుల సమ్మెకు కాదు టిఎస్ ఆర్టీసీకే చట్టబద్ధత లేదు

Satyam NEWS

జగన్ రెడ్డికి వణుకు పుట్టిస్తున్న సీ ఓవర్ సర్వే

Satyam NEWS

జమ్మూ కాశ్మీర్ లో ఐదుగురు ఉగ్రవాదులు హతం

Satyam NEWS

Leave a Comment