తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం అమ్మవారు సూర్యప్రభ వాహనంపై తిరుమాఢ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. పద్మావతి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి.
previous post