26.7 C
Hyderabad
April 27, 2024 07: 04 AM
Slider హైదరాబాద్

Hyderabad Special: పేద‌ల‌కు ఫంక్ష‌న్ హాళ్ల‌లో క‌రోనా వైద్యం

#Function hall

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మున్సిప‌ల్ కార్పోరేష‌న్ పరిధిలో ఫంక్ష‌న్ హాళ్ల‌ను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చ‌నున్నారు. హైదరాబాద్ లో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య ప్ర‌మాద‌క‌రంగా పెరుగుతోంది. అధికారులు యుద్దప్రాతిప‌దిక‌న నియంత్ర‌ణ చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ప్ప‌టికీ వ్యాధి వ్యాప్తి అదుపులోకి రావ‌డం లేదు.

దీంతో మ‌రింత అలెర్టయ్యింది జీహెచ్ఎంసీ యంత్రాంగం. 1500 బ‌స్తీల‌లో ప్ర‌త్యామ్మాయ ఏర్పాట్లు చేయ‌నున్నారు. ఈ బ‌స్తీల్లో దాదాపు 20 ల‌క్ష‌ల మంది నివ‌శిస్తున్న‌ట్టు అధికారులు అంచ‌నా వేస్తున్నారు.

ప్ర‌స్తుతానికి ల‌క్ష‌ణాలు లేని, స్ప‌ల్ప ల‌క్ష‌ణాలు ఉన్న‌వారికి ఇంట్లోనే చికిత్స పొందేలా హోమ్ ఐసోలేష‌న్ కిట్లు అంద‌జేస్తున్నారు. అయితే ఇంట్లో వైద్యానికి సౌక‌ర్యం లేని వారి కోసం ఫంక్ష‌న్ హాళ్ల‌ను ఐసోలేషన్ కేంద్రాలుగా మార్చుతున్నారు.

Related posts

జగన్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ పెట్టడం హాస్యాస్పదం

Satyam NEWS

నెల్లూరు జిల్లా అడ్మిన్ అదనపు ఎస్ పి గా హిమవతి

Satyam NEWS

పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలి

Satyam NEWS

Leave a Comment