32.7 C
Hyderabad
April 26, 2024 23: 34 PM
Slider ఆదిలాబాద్

తృటిలో తప్పించుకున్న టాప్ మావోయిస్టులు

#Moiest leaders

కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండల అటవీ ప్రాంతంలో పోలీసులకు తారసపడ్డ మావోయిస్టులు తృటిలో తప్పించుకున్నారు. తప్పించుకున్న వారిలో సిపిఐ మావోయిస్టు కీలక సభ్యులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం తీర్యాని మండలం అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకున్న అనంతరం ఆసిఫాబాద్ జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసుల గాలింపు చర్యలు కొనసాగించారు.

ఈ నేపథ్యంలో రాత్రి 10:30 గంటలకు తిర్యాని మండలంలోని తోక్కుగుడ గ్రామంలో పోలీసు పార్టీలు శోధిస్తున్నప్పుడు ఆలివ్ ఆకుపచ్చ రంగులో ఉన్న మావోయిస్టు దళం కీలక సభ్యులు ఎకె 47, ఎస్ఎల్ఆర్ ఆయుధాలతో పోలీస్ పార్టీపై కాల్పులు జరిపేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీస్ పార్టీలు వెంబడించి పట్టుకునే ప్రయత్నం చేశాయి.

దళం సభ్యులు అక్కడి నుండి చీకటిలో పారిపోయారు. పోలీసులు వెంబడించిన దళంలో స్టేట్ కమిటీ నెంబర్  మైలారెపు అడేల్లు, @ భాస్కర్, ఏరియా కమిటీ మెంబర్లు  వర్గేష్,  మాంగు,  అజయ్, రాములను ఉన్నట్లు గుర్తించారు. వీరిని పట్టుకోవడానికి తీవ్రమైన గాలింపు చర్యలు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

వీరి కోసం 1000 మంది పోలీస్ బలగాలు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టులకు సహకరించిన గ్రామస్తులను అదుపులోకి తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. అదేవిధంగా ఈ గ్రామాలకు వచ్చిపోయే వారిపై నిఘా ఉంటుందని, మావోయిస్టు దళం ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం అందిస్తామని పోలీసులు తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని జిల్లా ఎస్పీ విష్ణు ఎస్, వారియర్ తెలిపారు.

Related posts

1xbet Chile【opinión 2022】- $150 000 Clp Bono【gratis】

Bhavani

పాత చట్టాలను మార్చేస్తున్నాం

Satyam NEWS

బీహార్ ఉప ముఖ్యమంత్రి బెయిల్ రద్దుకు సీబీఐ యత్నం

Satyam NEWS

Leave a Comment