37.2 C
Hyderabad
May 6, 2024 19: 42 PM
Slider విశాఖపట్నం

ఏయూ వైఎస్ ఛాన్స‌ల‌ర్ ను రీ కాల్ చేయాలంటూ టీఎన్ఎస్ఎఫ్ డిమాండ్

#TNSF

చలో ఆంధ్ర యూనివర్సిటీ అంటూ తెలుగు యువ‌త పిలుపు

ఛ‌లో ఆంధ్రా యూనివ‌ర్సిటీకి తెలుగు నాడుస్టూడెంట్ ఫెడ‌రేష‌న్ పిలుపు నిచ్చిన సంగ‌తి విదిత‌మే.అయితే ఈ విష‌యం స్పెష‌ల్ బ్రాంచ్ ద్వారా తెలుసుకున్న పోలీసులు…స‌ద‌రు టీఎన్ఎస్ఎఫ్ నేత‌ల‌ను  విశాఖ‌కు వెళ్ల‌కుండా అడ్డుకున్నారు. ఈ మేర‌కు  ముందుగానే చలో ఆంధ్రా యూనివర్సిటీ కార్యక్రమానికి వెళ్తున్న టిఎన్ఎస్ఎఫ్ నేత‌ విజయనగరం పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి మాడుగుల భానుప్రకాష్ ను….పోలీసులు  అరెస్ట్ చేసారు. ఈమేర‌కు టూటౌన్   స్టేషన్ పోలీసులు అరెస్టు చేసి అక్క‌డే ఉంచ‌డం జరిగింది.

అయితే ఈ సందర్భంగా మాడుగుల భానుప్రకాష్ మాట్లాడుతూ ఆంధ్రా యూనివర్సిటీ వైఎస్ ఛాన్స‌ల‌ర్  ప్రసాద్ రెడ్డి అన్యాయంగా విద్యార్ధుల‌పై కేసులు బ‌నాయించార‌ని ఆరోపించారు. పెంచిన ఫీజులు త‌గ్గించాల‌ని యూనివ‌ర్సిటీ విద్యార్ధులు…కోర‌డం  త‌ప్పా అంటూ ప్ర‌శ్నించారు. ఇక  నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని అడిగితే విద్యార్థుల పై అక్రమ కేసులు పెట్టడంఎంత‌వ‌ర‌కు స‌బ‌బు అని  అన్నారు.అందుకు నిరసనగా టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంఘాల ఆధ్వర్యంలో చలో ఆంధ్రా యూనివర్సిటీ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. కానీ . సీఎం జ‌గ‌న్ అధికారంలో ఉన్నారనే కారణంచేత విద్యార్థులు,లెక్చ‌ర‌ర్ల‌ పై ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వైఎస్ ఛాన్స‌ల‌ర్ కు బుద్ధి చెబుతామని. ఆదే విదంగా వీసీ రీకాల్ చేయాలని డిమాండ్ చేశారు

Related posts

జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

Satyam NEWS

దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమే

Satyam NEWS

ఆందోళన కలిగిస్తున్న కరోనా పాజిటీవ్ కేసులు

Satyam NEWS

Leave a Comment