28.7 C
Hyderabad
April 27, 2024 05: 22 AM
Slider శ్రీకాకుళం

వ్యాయామ ఉపాధ్యాయుడు డా. మోహన్ కు మరో అంతర్జాతీయ పురస్కారం

#gundabalamohan

శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దపాడు ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు గా పనిచేస్తున్న డా. గుండబాల మోహన్ కు మరో అంతర్జాతీయ పురస్కారం లభించింది. భారతదేశం స్టార్ రికార్డ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్  సంస్థ వారు జాతీయ స్థాయి ఉత్తమ వ్యాయామ ఉపాధ్యాయుడి పురస్కారం ఆయనకు అందించారు.

తనకు ఈ   పురస్కారాన్నిఅందజేసిన స్టార్ రికార్డు బుక్ ఆఫ్  బుక్  ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ అంతర్జాతీయ చైర్మన్ డా.విక్రాంత్ మిశ్రా కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తనకు ఈ పురస్కారం  వర్చువల్ విధానం ద్వారా ప్రధానం చేశారని ఆయన తెలిపారు. తాను పనిచేస్తున్న పాఠశాలలో బాల బాలికలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని మెడల్స్ సాధించినందుకు తనకు ఈ పురస్కారం అందజేశారని తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ  సంఘ  సభ్యులు యమ్. వి. రమణ యమ్. సాంబమూర్తి, నిర్మల్ కృష్ణ, బడి. రమణ, బి. నారాయణ, తవిటయ్య, హరి, వై. వి .పోలినాయుడు, సతీష్ రాయుడు, హరీష్ రాయుడు, ఎమ్మెస్సీ. శేఖర్, మాధవరావు,  పురుషోత్తం, రాజారావు, సుశీల, రోజా, బి. రమేష్ ఎల్ .దిలీప్, వై. రామారావు, కె .నరేష్, సిహెచ్. రాజేశ్వరి, సిహెచ్. శ్రీనివాసరావు, మధు ,బాలకృష్ణ   శ్రీకాకుళం జిల్లా జిల్లా క్రీడా ప్రాధికార క  సంస్థ అధికారి బడి. శ్రీనివాసరావు, డాక్టర్. కె .శ్రీధర్, పెద్దపాడు వెయిట్ లిఫ్టింగ్ కోచ్ అప్పన్న, కుస్తీ  ఆటలు కోచ్ బీ గోవిందు  ఆయనకు  శుభాకాంక్షలు తెలిపారు.

Related posts

ఒక్కో టిక్కెట్ రూ.5 లక్షలకు అమ్ముకున్నారు

Satyam NEWS

చీఫ్ సెక్రెటరీ సోమేశ్ కుమార్ నియామకం అక్రమం

Satyam NEWS

బాసర అమ్మవారిని దర్శించుకున్న ఢిల్లీ పోలీస్ బాస్

Satyam NEWS

Leave a Comment