ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకపోయినా రాజధాని రైతులు మాత్రం తమ ఆందోళన ఆపడం లేదు. రాజధాని రైతుల నిరసనలు నేడు 25 వరోజుకు చేరుకున్నాయి. దాదాపుగా అన్ని రాజధాని గ్రామాల్లో ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతున్నాయి. తుళ్లూరు, మందడం గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు.
దళిత రైతులు నేడు వాహన ర్యాలీ చేపడతామని ప్రకటించిన నేపథ్యంలో అంతటా ఉత్కంఠ నెలకొన్నది. శుక్రవారంనాడు జరిగిన దారుణమైన పరిస్థితులు పునరావృతం అవుతాయా అని అన్నట్లుగా వాతావరణం ఉంది.