గ్యాంగ్ స్టర్ ఇక్బాల్ మిర్చి మరియు అతని అనుచరులపై గల మనీలాండరింగ్ కేసు కు సంబందించిన దర్యాప్తులో భాగంగా దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (డిహెచ్ఎఫ్ఎల్) చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ కపిల్ వాధావన్ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసినట్లు అధికారులు సోమవారం తెలిపారు.కపిల్ వాధావన్ దర్యాప్తుకు సహకరించనందునే అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ కేసు ఇక్బాల్ మిర్చి ముంబై ఆస్తులకు సంబంధించినది కాగా వీటిని నేరాల ఆదాయంగా పిలుస్తారు. అలాంటి మూడు ఆస్తులను వారు సన్‌బ్లింక్ సంస్థకు కు విక్రయించారు, ఈ సంస్థ కపిల్ వాధావన్ సోదరుకు సంబంధించింది. ముంబైలో ఖరీదైన రియల్ ఎస్టేట్ ఆస్తుల కొనుగోలు మరియు అమ్మకంలో అక్రమ లావాదేవీలు జరిగాయని మనీలాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు దర్యాప్తు సంస్థ ఇక్బాల్ మిర్చి, అతని కుటుంబ సభ్యులు ఇతరులపై క్రిమినల్ కేసు నమోదు చేసింది.2013 లో లండన్‌లో మరణించిన ఇక్బాల్ మిర్చి, దావూద్ ఇబ్రహీం యొక్క కుడిభుజంగా ఉండేవాడని ఈ డి ఆరోపించింది.