40.2 C
Hyderabad
May 2, 2024 15: 12 PM
Slider విజయనగరం

ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఆ రోడ్ లో ప్రయాణం నరకం ప్రాయం..!

#bus

మీరెప్పుడైనా నరకం చూసారా…? అయితే వెనువెంటనే విజయనగరం జిల్లా కేంద్రం కు వెళ్లండి. నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ లో ఏదో రూట్ వైపు బస్ ఎక్కండి…కొద్ది సేపటికి ఆ నరకం అంటే ఏంటో…? అదెలా ఉంటుందో క్షణాల్లో మీకే తెలుస్తుంది. ఇటీవలే ఆర్టీసీ కాంప్లెక్స్ లో అన్నీ బస్ లను..కాంప్లెక్స్ వెనుక నుంచీ జేడ్పీ పక్క నుంచే పీవీఆర్ హాస్పిటల్ మీదుగా అదేనండీ లీలామహర్ థియేటర్ పక్క నుంచీ వెళుతున్నాయి.కాంప్లెక్స్ అవుట్ గేట్ నుంచీ మొన్నటి వరకు విశాఖ, సాలూరు బస్సులు వెళ్లేవి.కానీ ఈ మధ్యలో ట్రయిల్ కోసం ఆర్టీసీ అధికారులు… బస్ లు అన్నింటినీ ఒకే రూట్ లోకి వెళ్లాలన్న ఆదేశాలతో బస్ డ్రైవర్ లు తు.చ తప్పకుండా పాటిస్తున్నారు.

కానీ లీలామహర్ దారి గుండా బస్సులు తిరగడంతో ప్రయాణీకులకు నరకం నకళ్లు కనిపిస్తున్నాయి. ఈ విషయం తెలియని పొరుగూరు నుంచే ఓ సూపర్ డీలక్స్ బస్ వ్యతిరేక రూట్ లో కాంప్లెక్స్ కు రావడం… నిజంగానే ప్రయాణీకులతో పాటు లీలామహర్ దారిలో వెళ్లే ప్రయాణీకులు వాహన చోదకులు… నరకం చూసారు.దాదాపు గంటకు పైగా ఆ రూట్ బస్సు లు వెళ్లలేక రూట్ మొత్తం జామ్ అవడంతో క్లియర్ చేయడానికి ట్రాఫిక్ ఏఎస్ఐ రామకృష్ణ నానా వ్యయ ప్రయాసలు పడాల్సి వచ్చింది. అక్కడ పరిస్థితి “సత్యం న్యూస్. నెట్” కు చిక్కడంతో… వెనువెంటనే వెలుగులో కి తీసుకు వచ్చింది.

Related posts

వివాదాస్పదమవుతున్న రైతు వేదికలు

Satyam NEWS

టోల్ రోడ్ లీజ్ వల్ల రాష్ట్రానికి నష్టం

Bhavani

నేను మంత్రిని కరోనా అంటే నాకేం భయం?

Satyam NEWS

Leave a Comment