29.7 C
Hyderabad
May 1, 2024 03: 52 AM
Slider విజయనగరం

ట్రాఫిక్ పోలీసుల అలెర్ట్.. తప్పిన పెను ప్రమాదం..!

#vijayanagarampolice

విజయనగరం జిల్లా కేంద్రం లో ఈ సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా చల్లబడి… ఆకాశం మేఘావృతమై వర్షం పడటం ఒక ఎత్తు అయితే… రాత్రి ఏడు న్నర ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించడం…క్షణాల్లో ఆర్పడంతో పెను ప్రమాదమే తప్పింది. పర్యవసనంగా..రెండున్నర లక్షల నష్టం సంభవించింది. నగరంలో ఎత్తు బ్రిడ్జి వద్ద ఏడాది క్రితం… డిప్యూటీ స్పీకర్ కోలగట్ల, మంత్రి విద్య శాఖ మంత్రి చేతుల మీదుగా ప్రారంభం అయిన…ఫౌంటెన్.. విద్యుత్ కాంతులతో నిర్మించిన ప్రాకారం వద్జ షాట్ సర్క్యూట్ సంభవించడంతో…ఒక్క సారి గా మంటలు వ్యాపించాయి.

ఇక ఆ సమయంలో… సమీపంలో ఉన్న రైల్వే విద్యుత్ లైన్లు అంటుకోబోతున్న తరుణంలో… ఫైర్ ఇంజన్ వచ్చి… ఎగిసిన మంటలు ఆరిపోయియి.అయితే… ఎత్తు బ్రిడ్జి వద్ద జరిగిన అగ్ని ప్రమాదాన్ని గుర్తించడం… సకాలంలో ఆపడానికి..ట్రాఫిక్ సిబ్బందే కారణమని చెప్పాలి.మంటలను చూసిన ట్రాఫిక్ హెచ్. సీ ప్రసాద్… హోమ్ గార్డ్ కాశీ.. ట్రాఫిక్ పీసీ సింహాచలంలు చూడటం.. సమాచారాన్ని పై అధికారులకు చెప్పడంతో పాటు ఫైర్ ,విద్యుత్, మున్సిపల్ అధికారులకు చెప్పడంలో కీలక భూమిక పోషించారు.

దీంతో పెను ప్రమాదం తప్పినా…2 న్నర లక్షల ఆస్థి నష్టం సంభవించిందని మున్సిపల్ డీఈ అప్పారావు చెప్పారు.సమాచారం అందిన వెంటనే ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావు ,ఎస్ఐ లు లోవరాజు ,రాజు ,హుటాహుటిన ఘటనాస్థలికి వచ్చి పరిస్థితి ని అదుపులోకి తీసుకు వచ్చే లా చర్యలు తీసుకున్నారు.

Related posts

మొక్కలు నాటిన సినీ నటి హేమల్

Satyam NEWS

భారత సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించిన చైనా

Satyam NEWS

ఆ ఫ‌స్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ను స్వ‌చ్చంద సంస్థ‌లు స‌న్మానించాయి…ఎందుకంటే…

Satyam NEWS

Leave a Comment