33.7 C
Hyderabad
April 29, 2024 02: 58 AM
Slider విజయనగరం

నడి రోడ్ పై త్రిబుల్ రైడింగ్… పట్టుకుంటే అది దొంగ లించిన బుల్లెట్..!

#traffic

నగరాలలోనే కాదు పట్టణాల్లో కూడా రయ్…రయ్ మంటూ బైక్ లపై దూసుకెళుతున్న ఘటనలు కొకొల్లలు. ప్రతీ రోజూ పోలీసులు బైక్ రైడింగ్స్…ట్రాఫిక్ నియమాల అతిక్రమణలపై ఓ వైపు ప్రజలను చైతన్య పరుస్తూనే మరోవైపు పోలీసులు… ఫైన్ లు వేస్తున్నారు కూడా. ఈ సోదంతా మాకెందుకని…ఇక్కడి తో “సత్యం న్యూస్. నెట్” రాసే న్యూస్ ను చదవడం మానేస్తే… మీకే నష్టం.

ఈ “సత్యం న్యూస్. నెట్” రాసిన న్యూస్ చదివైనా సరే…రోడ్ పై మీరు ఎలా వెళ్లాలో..ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో మీరే మిగిలిన వారికి చెబుతారు. ఇక న్యూస్ లోకి వెళితే…. విజయనగరం లో ఆర్టీసీ కాంప్లెక్స్ దరి…అనునిత్యం ట్రాఫిక్ రద్దీ.. మరో వైపు రోడ్ వెడల్పు పనులు ఈ క్రమంలో ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం అదే ప్రాంతంలో తోటపాలెం వెళ్లే దారిలో కాలేజీల నుంచీ విద్యార్ధినీ.విద్యార్థుల రద్దీ. దీంతో అనునిత్యం అక్కడ ఏదో ఒక రోజు ర్యాగింగ్ జరుగుతునే ఉంటోంది.

కాగా ఇటీవలే పోలీసు కంట్రోల్ రూంకు ఫోన్ రావడం దాంతో పాటు.. వన్ టౌన్ పోలీసు స్టేషన్ కు ఫిర్యాదులు రావడంతో ఎస్పీ ఆదేశాల మేరకు నేరుగా వన్ టౌన్ సీఐ డా.వెంకటరావు… స్పెషల్ టాస్క్ ఫోర్స్ తో తోటపాలెం ప్రాంతంలో అటు వాహన తనిఖీలు ఇటు ర్యాగింగ్ వ్యవహారం పై దృష్టి పెట్టగా…బొత్స గురునాయుడు కాలేజీ వద్ద ఓ బుల్లెట్ పై త్రిబుల్ రైడింగ్ ను పట్టుకున్నారు. తీరా విచారిస్తే… ఆ బైక్ ఇటీవలే అపహరించిన బైక్. దీంతో పోలీసులు ఒక్కసారి ఖంగుతిని..అదే ప్రాంతంలో విస్తృతంగా తనిఖీ చేపట్టారు.

ఈ కేసు పై “సత్యం న్యూస్. నెట్” ప్రతినిధి ప్రశ్నించగా…ఈ ప్రాంతం నుంచీ ఫిర్యాదులు వచ్చాయని…వచ్చి పరిశీలిస్తే…బైక్ దొంగతనాల చిట్టా లభించిందని అన్నారు… వన్ టౌన్ సీఐ డా.వెంకటరావు. కాగా ఈ ఆకస్మిక తనిఖీ ల్లో ఇటీవలే ట్రాఫిక్ విభాగం నుంచీ వన్ టౌన్ కు వచ్చిన ఎస్ఐ భాస్కర్, రామ్ గణేష్, విజయ్…ఎస్టీఎఫ్ పీసీ నాయుడు..కానిస్టేబుల్ దేవిలు ఉన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

స్క్రాచ్ కార్డు పేరుతో జేబులు గీకేస్తున్నారు… జాగ్రత్త

Satyam NEWS

మంత్రి చెల్లుబోయినపై ఎంపి ఫిర్యాదు

Satyam NEWS

మాట ఇవ్వడం.. మర్చిపోవడం కల్వకుంట్ల కుటుంబానికే సాధ్యం

Bhavani

Leave a Comment