23.7 C
Hyderabad
May 8, 2024 04: 51 AM
Slider రంగారెడ్డి

గిరిజనులపై విద్యుత్ శాఖ అధికారుల కక్ష

girijana tanda

గిరిజనులపై విద్యుత్ అధికారుల కక్ష ధోరణితో గత వారం రోజుల నుంచి కరెంటు సరఫరా ను నిలిపి వేసిన సంఘటన కొడంగల్ మండలం లోని పలుగురాళ్ల తండాలో చోటు చేసుకుంది. తాండ వాసుల కథనం మేరకు నూతనంగా ఏర్పడిన పలుగు రాళ్ల తండా కు కు గడ్డమీది తండా జీడి గడ్డ తండా ఇక చెరువు తండ గోపాల్ నాయక్ తండ లు ఉన్నాయి. అయితే ఈ తండావాసులు గత నెల విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ విద్యుత్ శాఖ అధికారులు నిలిపి వేయడం జరిగింది. పేదరికంలో ఉన్న గిరిజనులకు బిల్లులు చెల్లించలేదని కరెంటు నిలిపివేయడం సరైన పద్ధతి కాదని కొందరు అంటున్నారు. దీనిపై అధికారులను వివరణ కోరగా గిరిజనులు నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరి కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తండావాసులు విద్యుత్ బకాయిలు మొత్తం చెల్లిస్తేనే కరెంటు ఇస్తామని లేకపోతే ఇవ్వమని తేల్చిచెప్పారు. రాత్రి వేళల్లో కరెంటు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అదేవిధంగా గత వారం రోజుల నుంచి తాగునీటికి నానా తంటాలు పడాల్సి వస్తుందని గిరిజనులు అంటుననారు. బిల్లులు కడతామని  కరెంటు ఇవ్వాలని కోరిన కాదు  తండాలు మొత్తం ఒకేసారి కట్టాలని అప్పుడే కరెంటు ఇస్తామని అధికారులు చెప్పడం బాధాకరంగా ఉందన్నారు.  ఇకనైనా అధికారులు ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే గిరిజనులకు జరుగుతున్న అన్యాయం పై స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో కోడంగల్ విద్యుత్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు.

నరేష్ కుమార్

Related posts

ఏపీ రాజకీయాల్లో జగన్ విష సంస్కృతి మొదలుపెట్టాడు

Satyam NEWS

కమలం పార్టీపై కదంతొక్కనున్న కారు, ఫ్యానూ

Satyam NEWS

బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ దేశానికి ముప్పులా తయారయ్యాయి

Bhavani

Leave a Comment