32.2 C
Hyderabad
May 8, 2024 21: 49 PM
Slider ఆంధ్రప్రదేశ్ తెలంగాణ

కమలం పార్టీపై కదంతొక్కనున్న కారు, ఫ్యానూ

ys ktr

తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న రెండు పార్టీలూ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి పూర్తిగా దూరంగా జరిగినట్లే కనిపిస్తున్నది. రెండు రాష్ట్రాలలో అధికారంలోకి వచ్చేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నాలు ఇందుకు కారణం కావచ్చు. తెలంగాణపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బిజెపి, రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఎలాంటి ముందడుగు వేయలేకపోతున్నది. రాష్ట్రం ఏర్పడినప్పుడు అసెంబ్లీలో ఉన్న ఐదు సీట్లు ఇప్పుడు ఒక్కటిగా మారిపోయింది.

పార్లమెంటు ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించిన తర్వాత కూడా ఆ తర్వాత జరిగిన హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికతో బిజెపికి ఉన్న పరువు కాస్తా పోయింది. అయితే ఆర్టీసీ సమ్మె లో పూర్తి స్థాయి జోక్యం చేసుకుని టిఆర్ఎస్ ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నది. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో జనసేన, తెలుగుదేశం పార్టీల కన్నా దారుణంగా అధికార వైసిపిపై అక్కడి బిజెపి విమర్శలు చేస్తున్నది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రైస్తవుడు కావడం వల్ల మత అంశాన్ని పదే పదే బిజెపి అక్కడ ప్రస్తావిస్తున్నది. దీనితో అక్కడి అధికార పార్టీ తీవ్రమైన వత్తిడులకు లోనవుతున్నది. రాజకీయంగా తెలుగుదేశం, జనసేన చేస్తున్న డ్యామేజి కన్నా బిజెపి చేస్తున్న డ్యామేజితో అక్కడి ప్రభుత్వం అతలాకుతలం అయిపోతున్నది. ఈ కారణంతో తెలంగాణలో టిఆర్ఎస్, ఏపిలో వైసిపి లు రాబోయే పార్లమెంటు సమావేశాలలో తమ తమ పార్లమెంటరీ పార్టీలను బిజెపి ప్రభుత్వంపై యుద్ధానికి సన్నద్ధం చేశాయి.

పార్లమెంటరీ సమావేశాల్లో విభజనచట్టంలో పేర్కొన్న హమీలు, పెండింగ్ తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తులను లేవనెత్తాలని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ ఎంపిలకు చెప్పారు. చట్టంలో పేర్కొన్న మేరకు ఏర్పాటు చేయాల్సిన ఐఐయం లాంటి విద్యాసంస్ధలు, బయ్యారం ఉక్కు కర్మాగార ఏర్పాటు  వంటి విభజన హమీలను, మిషన్ భగీరథకు కేంద్ర నిధులు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి తెలంగాణ ప్రభుత్వ విజ్జప్తులను ఈ సమావేశాల్లో పాలో అప్ చేయాలని ఆయన సూచించారు.

పార్లమెంట్ లో అంశాల వారీగా టీఆర్ఎస్ పార్టీ వైఖరి ఉంటుందని, అంతిమంగా తెలంగాణ రాష్ర్ట ప్రయోజనాలే పరమావధిగా పార్టీ నిర్ణయం  ఉంటుందని తెలిపారు. గత ఐదు సంవత్సరాల నుంచి అనేక అంశాల మీద కేంద్ర ప్రభుత్వానికి పలుసార్లు లేఖలు రాసిందని, అందులో హైదరాబాద్ నగరంలో రోడ్డు ప్రాజెక్టుల కోసం రక్షణ భూముల బదలాయింపు, ఫార్మాసిటీకి నిమ్జ్ హోదా వంటి తక్షణ అవసరం అయిన అంశాలపైన ఎంపీలు పనిచేయాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన పలు విజ్ఞప్తులపైన కేంద్ర మంత్రులు గతంలో హమీ ఇచ్చారని, కానీ చాలకాలంగా అవి అంశాలు పెండింగ్ లో ఉన్నాయని,  ఇలాంటి వాటిని ఫాలో అప్ చేయాలన్నారు.

అదే విధంగా లోక్‌సభలో వైసిపి నాలుగో పెద్ద పార్టీ  అని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ పార్లమెంటు సభ్యులకు గుర్తు చేస్తూ బలాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రజల కోసం ఉపయోగించాలని ఎంపీలను కోరారు. పోలవరం సహా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విడుదల కోసం కృషి చేయాలని, విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చేలా కేంద్రాన్ని గట్టిగా కోరాలని సూచించారు. పోలవరంపై ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.11,800 కోట్లు ఖర్చు చేయగా కేంద్రం రూ 8,577 కోట్లు విడుదల చేసిందని, గత వారం రూ 1,850 కోట్లు ఇచ్చిందని ముఖ్యమంత్రి చెప్పారు.

రాష్ట్రం చేసిన ఖర్చులో ఇంకా రూ.3,222 కోట్లు రావాల్సి ఉందన్నారు. సవరించిన అంచనాల ప్రకారం రూ.55,549.87 కోట్లకు ఆమోదం తెలపాల్సి ఉందని చెప్పారు. విభజన నాటికి కాగ్‌ లెక్కల ప్రకారం రూ 22,948.76 కోట్ల ఆర్థిక లోటు ఉన్నట్లు తేలగా ఇప్పటివరకూ రూ 3,979 కోట్లు ఇచ్చారని మిగిలిన రూ 18,969 కోట్ల విడుదల కోసం కృషి చేయాలన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా వెనుకబడిన జిల్లాలకు రూ.7,530 కోట్లు ఇవ్వాల్సి ఉండగా కేంద్రం రూ.1,050 కోట్లు ఇచ్చిందని మిగిలిన నిధుల విడుదలకు గట్టిగా ప్రయత్నించాలని సీఎం సూచించారు.

ఉపాధి హామీ కింద రూ.2,246 కోట్ల నిధులు రావాలన్నారు. పీఎంజీఎస్‌వై కింద రోడ్ల నిర్మాణ దూరాన్ని 3,285 నుంచి 6,135 కిలోమీటర్లకు పెంచాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చేసిన విజ్ఞప్తిని పార్లమెంట్‌  సమావేశాల్లో ప్రస్తావించాలన్నారు. ఇతర రాష్ట్రాలకు ఇచ్చిన మాదిరిగానే ఏపీకి కూడా 7 కొత్త మెడికల్‌ కళాశాలలను మంజూరు చేయాల్సిందిగా కోరాలని సూచించారు. గోదావరి–కృష్ణా అనుసంధానాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించేలా పార్లమెంట్‌లో ప్రస్తావించాలన్నారు. గ్రామీణ ప్రాంతాలకు 12 లక్షల ఇళ్లు కేటాయించి లబ్ధిదారుల ఎంపిక అర్హతలను సడలించాలని కోరాలన్నారు.  వీటితో బాటు ఎవరూ కూడా విజయసాయిరెడ్డి లేకుండా కేంద్ర మంత్రులను కలవడానికి వీల్లేదని షరతు విధించారు. డిమాండ్ల చిట్టాలను బయట పెట్టడం ద్వారా రెండు రాష్ట్రాలలో బిజెపి విస్తరించకుండా చేయాలనే వ్యూహం టిఆర్ఎస్, వైసిపి లలో దాగి ఉన్నట్లే కనిపిస్తున్నది.

Related posts

5 నుంచి చంద్రబాబు అనంతపురం జిల్లా పర్యటన

Satyam NEWS

మిర్చి రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి

Satyam NEWS

పెళ్లికి ఇవ్వాల్సిన చెక్కులు పిల్లలు పుట్టినంక ఇస్తురు

Satyam NEWS

Leave a Comment