31.2 C
Hyderabad
May 3, 2024 01: 49 AM
Slider ఆదిలాబాద్

గిరిజనుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

distic collector

గిరిజన సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం  పీఎం ఆర్సీ భవనం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు లో రాయసెంటర్ ల సార్ మెడీలతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాయి సెంటర్ లో సార్ మెడి లు తెలిపిన సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి తన పరిధిలోని వాటిని సాధ్యమైనంత వరకు పరిష్కరిస్తానన్నారు.

తన పరిధిలో లేని వాటిని ప్రభుత్వానికి విన్నవిస్తానని తెలిపారు. రాయి సెంటర్ ల ద్వారా సమస్యలను తెలుపవచ్చని, ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా చూస్తామని తెలిపారు.

భూములకు సంబంధించిన వాటి వివరాలు గిరిజన ప్రాంతాల్లోని తహసీల్దార్ ల నుండి తెప్పించుకుని పరిశీలిస్తామని తెలిపారు.

ధరణీ పోర్టల్ లో మీ సేవా కేంద్రాలలో భూములకు సంబంధించిన సమస్యలపై దరఖాస్తు చేసుకోవలసి ఉంటుందని తెలిపారు. భూములు సాగుచేస్తున్న వారికి పట్టాలు, రైతుబంధు వర్తించేవిధంగా వ్యవసాయ అధికారులకు ఆదేశిస్తామని తెలిపారు.

కరోనా వలన గత 2 సంవత్సరముల నుండి పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలు మూత బడ్డాయని, అయినప్పటికి ఆన్లైన్ క్లాసులు, ఇంటింటికి సరుకులు పంపిణీ చేశామని తెలిపారు.

ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బవేశ్ మిశ్రా మాట్లాడుతూ, గిరిజన ప్రాంతాల్లోని గ్రామాలలో సింగల్ పేజీ ఉన్న గ్రామాలకు త్రీ పేజ్ సౌకర్యం, కరంట్ లేని గ్రామాలకు  సింగిల్ ఫేజ్ సౌకర్యం కల్పించేందుకు పనులు ప్రారంభం అయ్యాయన్నారు.

మళ్ళి డిసెంబర్ లో జరిగే సమావేశం నాటికి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.

పలువురు సర్ మెడి లు మాట్లాడుతూ, వర్షాలవలన దెబ్బతిన్న రవాణా వ్యవస్థను పునరుద్ధరించాలని, దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం కల్పించాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని, అంగన్ వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించాలని కోరారు.

Related posts

విజయనగరం పైడితల్లి టెంపుల్ వద్ద కారు ప్రమాదం

Satyam NEWS

ఉద్యమనేత నండూరి బాటన మనమంతా నడవాలి

Satyam NEWS

కరోనా ఎలర్ట్: విద్యార్థులకు కరోనా వైద్య పరీక్షలు

Satyam NEWS

Leave a Comment