కడప జిల్లా రాజంపేట నవోదయ స్కూల్ కు చెందిన విద్యార్థులు రాజస్థాన్ రాష్ట్రం లోని ఖుద్దూర్ కు వెళ్లి రాగా ఆదివారం వారికి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో కరోన పరీక్షలు నిర్వహించారు. గత యేడాది చివరన రాజస్థాన్ రాష్ట్రంలో ని ఖుద్దూర్ లో తొమ్మిదో తరగతి సిలబస్ శిక్షణ కోసం 14 మంది బాలురు,9 మంది బాలికలు వెళ్లారు. ఈలోపు కరోనా మహమ్మారి విస్తరించడం అది రాజస్థాన్ కు కూడా పాకింది.
కరోనా నివారణలో భాగం గా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ, ప్రవేటు విద్యా సంస్థలను మూసి వేస్తున్నారు. అక్కడ నుంచి విద్యార్థులు రాజంపేట కు ఈ రోజు గూడూరు రైల్వేస్టేషన్ నుండి చేరుకున్నారు. దీనితో ముందస్తు జాగ్రత్తలల్లో భాగంగా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.
వారికి ఎటువంటి కరోనా వ్యాధి లక్షణాలు లేవని నిర్ధారణకు వచ్చినా,ముగ్గురికి జలుబు లక్షణాలు ఉండంతో అందరిని మరో 14 రోజుల పాటు నవోదయ పాఠశాలలో ప్రత్యేక గదిలో ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చివరిగా వైద్య పరీక్షలు చేసి అనంతరం ఇండ్లకు పంపాలని వైద్యులు సూచించారు.