37.2 C
Hyderabad
May 1, 2024 12: 06 PM
Slider ముఖ్యంశాలు

విద్య‌ల న‌గ‌రంలో హాకీ కోచ్ మేజ‌ర్ ద్యాన‌చంద్ దినోత్స‌వం…!

#nationalsportsday

ఆగ‌స్టు 29 జాతీయ క్రీడా దినోత్స‌వం…అనే దాని  కంటే..భార‌త హాకీ కోచ్, ఒలంపిక్స్ లో హాకీ క్రీడ త‌రుపున బంగారు ప‌త‌కాన్ని సాధించి పెట్టిన మేజ‌ర్ ద్యాన్ చంద్ జ‌న్మ‌దినోత్స‌వం అంటే క‌రెక్ట్ గా ఉంటుంది.ఈ స్మార్ట్ యుగంలో మద‌ర్స్ డే, ఫాద‌ర్స్ డే, ఫ్రెండ్స్ షిప్ డే  ఇలా అన్నింటికి అన్ని రోజులు వచ్చాయి..ఉన్నాయి.

కానీ స‌మైక్యంగాను క‌లిసి ఉండే క్రీడ‌లకు సంబంధించి ఓ డే నూ లేవు. దీన్నిదృష్టి లో పెట్టుకుని కేంద్ర ప్ర‌భుత్వం మేజ‌ర్ ధ్యాన్ చంద్ జ‌న్మ‌దినం సంద‌ర్బంగా జాతీయ క్రీడ‌ల దినోత్స‌వం తీసుకువ‌చ్చింది. ప్ర‌తీ ఏడా ఆగ‌స్టు 29న ఆయ‌న పుట్టిన రోజు కావ‌డంతో  అదే రోజు జాతీయ క్రీడా దినోత్స‌వం జ‌ర‌పాలని నిర్ణ‌యించింది. అయితే గ‌డ‌చిన ఏడాదిన్న‌ర నుంచీ క‌రోనా మూలంగా అన్ని నిల‌చిపోయాయి.

అది కాస్త త‌గ్గు ముఖం ప‌ట్ట‌డంతో మెల్ల‌మెల్ల‌గా ఒక్కొక్కొ ఫంక్ష‌న్ ప‌రిమిత సంఖ్య‌…సోష‌ల్ డి్స్ట‌న్స్, మాస్క్ శానిటైజ‌ర్ వంటి నియ‌మ నిబంధ‌న‌ల‌తో ఫంక్ష‌న్ల‌ను ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తోంది. అందులో బాగంగానే కేంద్ర క్రీడ‌ల మంత్రిత్వ శాఖ‌…జాతీయ క్రీడ‌ల దినోత్స‌వం…అదీ కూడా హాకీ కోచ్ మేజర్ ధ్యాన్ చంద్ బ‌ర్త్ డే నిర్వ‌హించాల‌ని అన్ని రాష్ట్రాల విద్యాశాఖ‌ల‌కు ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఆ ఆదేశాల మేర‌కు విజ‌య‌న‌గ‌రం జిల్లా విద్యాశాఖ రీజిన‌ల్ జాయంట్ డైర‌క్ట‌ర్ నాగ‌ల‌క్ష్మీ …న‌గ‌రంలోని రాజీవ్ క్రీడా మైదానంలో హాకీ కోచ్ మేజ‌ర్ ధ్యాన్ చంద్ జ‌న్మ‌దినోత్సవం తో పాటు జాతీయ క్రీడా దినోత్సవం జ‌రిగింది.ఈ దినోత్స‌వాన్ని జిల్లా స్పోర్ట్స్ డ‌వ‌ల‌ప్ మెంట్ శాఖ చూస్తున్న జేసీ మ‌హేష్ కుమార్ జ్యోతి వలిగించి ప్రారంభించారు.

ఈ సంద‌ర్బంగా జిల్లాలో పారాది ,ఆరిక‌తోట‌,తెర్లాం,వీఆర్ పేట‌,క‌స్పా మున్సిప‌ల్ హైస్కూల్ కు చెందిన అయిదుగురు పీఈటీల‌ను జేసీ  స‌న్మానించారు. అనంత‌రం జేసీ మాట్లాడుతూ విద్య‌ల‌న‌గ‌రంగా భాసిల్లే విజ‌యన‌గరం అన్ని రంగాల్లోనూ అందునా క్రీడల్లో కూడా ముందుంటోంద‌న్నారు.

క్రీడ‌లంటే అంద‌రూ క‌లిసి వ్యాయామం చేయ‌డ‌మేనని…ఒక్కొక్కో క్రీడ వ్యాయామ ప్ర‌తిభ ఉంటుంద‌న్నారు.ఈ కార్య‌క్ర‌మంలో డీఈఓ నాగ‌మ‌ణి,డీఎస్డీఓ ప‌లువురి క్రీడాకారులు పాల్గొన్నారు.

Related posts

తిరుపతి వందేభారత్‌లో 1,128 సీట్లు

Bhavani

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

Bhavani

నిషేధం కాదు నియంత్రణ .. క్రిప్టోకరెన్సీపై పార్లమెంట్ కమిటీ

Sub Editor

Leave a Comment