38.2 C
Hyderabad
April 29, 2024 11: 32 AM
Slider విజయనగరం

విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించండి

#bundobust

విజయనగరం పరేడ్ గ్రౌండ్ లో శాఖా సిబ్బందికి జిల్లా పోలీసు బాస్ “క్లాస్”

విజయనగరం ఉత్సవాలు, శ్రీశ్రీ శ్రీ పైడితల్లమ్మ అమ్మవారి తొలేళ్ళు, సిరిమానోత్సవం పండుగ సందర్భంగా బందోబస్తు నిమిత్తం వివిధ జిల్లాల నుండి విచ్చేసిన పోలీసు అధికారులు, సిబ్బందికి నిర్వహించాల్సిన విధి నిర్వహణ, తీసుకోవాల్సిన భద్రత చర్యలపై జిల్లా ఎస్పీ ఎం. దీపిక  దిశా నిర్దేశం చేసారు.

బందోబస్తు భద్రత విధులు నిర్వహించేందుకు జిల్లా కేంద్రంకు విచ్చేసిన పోలీసు అధికారులు, సిబ్బందితో పోలీసు పరేడ్ గ్రౌండులో జిల్లా ఎస్పీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ – పండగను తిలకించేందుకు వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల నుండి ప్రజలు, భక్తులు జిల్లాకు వచ్చే అవకాశం ఉన్నందున ఎవ్వరితో గొడవపడవద్దన్నారు. భక్తులు, ప్రజలతో మాట్లాడే సమయంలో సంయమనం పాటించాలని, ఏదైనా ఇబ్బందులు తలెత్తితే మీకు ఇన్చార్ట్ లు గా వ్యవహరించే అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళాలన్నారు.

సమస్యను సానుకూలంగా, సామరస్యపూర్వకంగా పరిష్కరించే విధంగా అధికారులు, సిబ్బంది చొరవ చూపాలన్నారు. ప్రతీ ఏడాది నిర్వహించే పండగ బందోబస్తు విధులేనని ఎవ్వరూ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించరాదన్నారు. ప్రతీ ఏడాది బందోబస్తు విధులను రెండు షిఫ్ట్ ల్లో నిర్వహించేవారని, సిబ్బంది సౌలభ్యం, విధి నిర్వహణలో ఖచ్చితత్వం కోసం ఈ ఏడాది మూడు షిఫ్టుల్లో బందోబస్తు విధులు నిర్వహించే విధంగా చర్యలు చేపట్టామన్నారు.

ఎవరూ ఏ తరహా విధులు నిర్వహించాలో ఇప్పటికే సిబ్బంది, అధికారులకు అవగాహన కల్పించామన్నారు. ఏమైనా సందేహాలు, సలహాలు ఉంటే తన దృష్టికి తీసుకొని వస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ స్పష్టం చేసారు. సిరిమానోత్సవంలో ప్రెజర్ పాయింట్లు అయిన పాత సోనియా జంక్షన్, కస్పా జంక్షన్, గురజాడ రోడ్డు వంటి ప్రాంతాల్లో అదనపు సిబ్బందిని నియమించామన్నారు.

సిరిమాను వెంట అనధికార వ్యక్తులు తిరగకుండా క్లియరెన్సు పార్టీలను ఏర్పాటు చేసామన్నారు. డిఎస్పీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియమించి, ఆయన పర్యవేక్షణలో ముగ్గురు సిఐలు పని చేసే విధంగా చర్యలు చేపట్టామని జిల్లాఎస్పీ ఎం.దీపిక తెలిపారు.

క్షేత్ర స్థాయిలో బందోబస్తు ఏర్పాట్లును స్వయంగా పర్యవేక్షించిన జిల్లా ఎస్పీ

బందోబస్తు నిమిత్తం బందోబస్తు ఏర్పాటు చేసిన ప్రతీ పాయింట్ ను జిల్లా ఎస్పీ ఎం.దీపిక స్వయంగా పర్యవేక్షించారు. సిరిమాను తిరిగే మూడు లాంతర్లు నుండి కోట జంక్షన్ మధ్య ప్రాంతాలను, ఆలయం పరిసర ప్రాంతాలు, హుకుంపేట నుండి ఆలయం మధ్య సిరిమాను తరలించే ప్రాంతాలను జిల్లా ఎస్పీ మరియు ఇతర పోలీసు అధికారులు సందర్శించారు. హుకుంపేట నుండి సిరిమాను, పూజారి తరలింపులో ఎటువంటి ఆలస్యం లేకుండా చూడాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

క్షేత్ర స్థాయిలో బందోబస్తు నిర్వహించే అధికారులు, సిబ్బంది విధులు గురించి అడిగి తెలుసుకొని, వారి సందేహాలను క్షేత్ర స్థాయిలోనే నివృత్తి చేసారు. షిఫ్ట్ డ్యూటీలకు హాజరయ్యే అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలన్నారు. శ్రీ పైడితల్లి అమ్మవారి దర్శనం కోసం ఆలయం వెనుక భాగం నుండి ఎవ్వరినీ, ఎట్టి పరిస్థితుల్లోను అనుమతించవద్దని జిల్లా ఎస్పీ ఎం. దీపిక అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ అస్మా ఫర్దీన్, పార్వతీపురం మన్యం అదనపు ఎస్పీ ఓ. దిలీప్ కిరణ్, డిఎస్పీలు ఆర్.గోవిందరావు, పి.శ్రీధర్, ఎ.ఎస్.చక్రవర్తి, ఆర్.శ్రీనివాసరావు, డి.విశ్వనాధ్, ఎల్.మోహనరావు, వీరకుమార్, మురళి, డి.ఆర్.సి, రెడ్డి, వి. వెంకట అప్పారావు, యూనివర్స్, పలువురు సిఐలు, ఎస్ఐలు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కొత్త పాత అనే తేడాలొద్దు…!

Satyam NEWS

తెలంగాణ ప్రభుత్వ వెబ్‌సైట్లు 48 గంటలు బంద్

Satyam NEWS

కరోనా విధుల్లో అసువులు బాసిన కుటుంబాలకు అండగా ఉంటాం

Satyam NEWS

Leave a Comment