32.2 C
Hyderabad
May 8, 2024 22: 37 PM
Slider మహబూబ్ నగర్

చెంచులకు రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో అవగాహన

#nagarkurnool

తెలంగాణ రాష్ట్ర గవర్నర్  తమిళ సై సౌందర్య రాజన్  ఆదేశాల మేరకు రెడ్ క్రాస్ సొసైటీ నాగర్ కర్నూల్ శాఖ ఆధ్వర్యంలో కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్- మొజార్ల  డీన్ రాజశేఖర్,  ప్రొఫెసర్ల తో చెంచులకి ఇంటి పరిసరాలలో పెంచుకోవాల్సిన  పండ్ల మొక్కలు, ఆకు కూరలు, కూరగాయల పెంపకంపై బుధవారం అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ శాఖ జనరల్ సెక్రెటరీ మదన్ మోహన్ రావు మాట్లాడుతు రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్  ఆదేశాల మేరకు చెంచులలో న్యూట్రిషన్ లోపాన్ని నివారించడానికి హార్టికల్చర్ వారితో ప్రత్యేక అవగాహన శిబిరాన్ని నిర్వహించామన్నారు. ఆకు కూరలు , కూరగాయలు తినడం వల్ల పోషకాలు సమృద్ధిగా లభిస్తాయని పిల్లలలో పోషకాహార లోపం లేకుండా చేయడానికి పండ్లు కూడా చాలా ఉపయోగమని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పోషకాహార లోపాన్ని నివరించాలని ఆయన సూచించారు.

రెడ్ క్రాస్ సొసైటీ నాగర్ కర్నూల్ జిల్లా శాఖ సెక్రెటరీ సి.రమేష్ రెడ్డి మాట్లాడుతు బౌరపూర్ అప్పపూర్ చెంచు పెంటలలో నివసిస్తున్న చెంచులకి పౌష్టికాహారలోపాన్ని నివారించడానికి గవర్నర్  పైలెట్ ప్రాజెక్ట్ మన జిల్లాలోని ఈ పెంటలని సెలెక్ట్ చేసారని మన జిల్లా కలెక్టర్ ఎల్.శర్మన్  సూచనలు సలహాలతో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి రెడ్ క్రాస్ చైర్మన్ డా.కె.సుధాకర్ లాల్  ఆధ్వర్యంలో ఈ రెండు పెంటలలోని చెంచుల ఆరోగ్యాన్ని, పౌష్టికాహారం లోపం నివారణ ని అధ్యయనం చేసాక  రాష్ట్ర వ్యాప్తంగా అమలు అయ్యేలా ప్రణాళికలు రూపొందించారన్నారు.

అప్పపూర్, బౌరపూర్ పెంటలలోని చెంచుల ఇంటిఇంటికి తిరిగి వారి జీవనశైలిని పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కోఆర్డినేటర్ డి.కుమార్, రెడ్ క్రాస్ సభ్యులు లోక్య నాయక్, రాజేష్, విఠల్, కాలేజ్ ఆఫ్ హార్టికల్చర్  డీన్ రాజశేఖర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గజానన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన గ్రామ వాలంటీర్

Satyam NEWS

పరిశ్రమలు తెచ్చి ప్రకాశం జిల్లాను అభివృద్ధి చేస్తా

Bhavani

స్టాటిట్యూటరీ వార్నింగ్: ప్రజలారా మంచి వాళ్లనే ఎన్నుకోండి

Satyam NEWS

Leave a Comment