38.2 C
Hyderabad
May 2, 2024 22: 09 PM
Slider ముఖ్యంశాలు

మరికొద్ది గంటల్లో అమెరికా ప్రయాణం..ఇంతలోనే యువతి దుర్మరణం

#accident

మరికొద్ది గంటల్లో అమెరికా వెళ్లాల్సిన ఓ యువతి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. విజయవాడ నుంచి కారులో హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరణం పద్మా నాయుడు కుటుంబం అమెరికాలో స్థిరపడింది. వారి స్వస్థలం విజయవాడ. ఇటీవల వారి బంధువుల ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు పద్మా నాయుడు కుమార్తె ప్రీతి వచ్చారు. ఆమె తన బంధువులతో కలిసి హైదరాబాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరారు. అయితే.. చీకటిగూడెం శివారు వద్ద వారి కారును సూర్యాపేట నుంచి హైదరాబాద్‌కు వెళుతున్న ఓ గుర్తు తెలియని విమానం ఢీకొట్టింది. దీంతో.. ప్రీతి కారు రోడ్డుపై మూడు పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ప్రీతి తలకు తీవ్రగాయాలు కావడంతో అమె అక్కడిక్కడే మృతి చెందారు. కారు నడుపుతున్న దొప్పలపూడి శ్రేయాస్, కారులో ప్రయాణిస్తున్న చేకూరి సరిత, దివి విశ్వవిఖ్యాత్, దివి పద్మావతిలకు గాయాలయ్యాయి. ప్రీతి మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం నకిరేకల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడ్డవారికి అదే ఆసుపత్రిలో చేర్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని కేతేపల్లి పోలీసులు తెలిపారు.

Related posts

డోన్ట్ కేర్: వైసిపి వారికి ఇది వార్త కాదు

Satyam NEWS

పాటపై దాడి చేయడం అప్రజాస్వామికం

Bhavani

పేద‌ల ఇళ్ల నిర్మాణానికి శ్రీ‌కారం..జూన్ 22 ప్రారంభోత్సవం…!

Satyam NEWS

Leave a Comment