40.2 C
Hyderabad
May 2, 2024 18: 26 PM
Slider నల్గొండ

పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన ఎమ్మెల్యే

#MLA Saidireddy

హుజూర్ నగర్ పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి, పర్యావరణ జెండాను ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి ఎగురవేశారు. హుజుర్ నగర్ మునిసిపాలిటీ లోని వివిధ వార్డులలో ఆయన పర్యటించారు. మొక్కలు నాటిన అనంతరం శాసనసభ్యుడు సైదిరెడ్డి మాట్లాడుతూ నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.

సీఎం కేసీఆర్,కేటిఆర్ కన్న ఆకుపచ్చ తెలంగాణ ఏర్పడాలంటే ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని అన్నారు. హుజుర్ నగర్ నియోజకవర్గం హరిత విప్లవం సృష్టించాలని అన్నారు. కెసిఆర్, కేటిఆర్  పిలుపుమేరకు ప్రతి ఒక్కరూ మనకోసం మనం అనే కార్యక్రమాన్ని బాధ్యతగా ప్రతి ఒక్కరూ స్వీకరించాలి,రానున్న తరాల వారికి స్వచ్ఛమైన గాలిని అందించేలా చెట్లను నాటే కార్యక్రమం చేపడదామని అన్నారు.

సీజనల్ వ్యాధులు పట్ల ప్రజలు జాగ్రత్త వహించాలని,మురుగు నీరు లేకుండా చూసుకోవాలని, మున్సిపల్ సిబ్బందితో పాటు ప్రతి ఒక్క పౌరుడు ఈ కార్యక్రమమును బాధ్యతగా స్వీకరించి పారిశుద్ధ్య శుద్ధీకరణలో భాగం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, సిబ్బంది, మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చనరవి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, మాజీ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్,వార్డు కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జగన్ కు రాజకీయ భవిష్యత్తు లేదు

Satyam NEWS

ట్రాజెడీ: ప్రేమ విఫలమై బావిలో దూకిన యువతి

Satyam NEWS

ఘనంగా ముఖ్యమంత్రి జగన్ జన్మదినం

Satyam NEWS

Leave a Comment