40.2 C
Hyderabad
April 28, 2024 17: 57 PM
Slider ముఖ్యంశాలు

వైయస్ షర్మిల ప్రజా ప్రస్థానం మహా పాదయాత్రకు అడుగడుగునా నీరాజనాలు

#sharmila

సూర్యాపేట జిల్లా ప్రజలు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థాన మహా పాద యాత్రకు అడుగడుగునా నీరాజనాలు పలుకుతున్నారని వైయస్సార్ తెలంగాణ పార్టీ హుజూర్ నగర్ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఆదెర్ల శ్రీనివాస రెడ్డి అన్నారు.

స్వరాష్ట్రం ఏర్పడి ఏడున్నర సంవత్సరములు అవుతున్నా తెలంగాణ ప్రజల కష్టాలు తీరలేదని ముఖ్యమంత్రి కెసిఆర్ నిరంకుశ పాలనను అంతమొందించాలని,తెలంగాణ రాష్ట్ర ప్రజల కష్ట సుఖాలను తెలుసుకుంటూ వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి  వైయస్ షర్మిల చేపట్టిన నాలుగువందల రోజులు నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్ర 37వ,రోజుకు చేరిందని, ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషములకు సూర్యాపేట  జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం అడ్డగుడూర్ గ్రామం నుంచి మొదలైన పాదయాత్ర అడ్డగుడూర్ మండలం శ్రీరామ్ నగర్,చిర్ర గూడుర్ గ్రామం మీదుగా అనంతారం గ్రామంలో మాట ముచ్చట కార్యక్రమం,అనతరం నందాపురం గ్రామం చేరుకొని నందాపురం ముగుస్తుంది ఆదెర్ల శ్రీనివాస రెడ్డి తెలిపారు.

ఈ ప్రజా ప్రస్థానం మహా పాదయాత్ర కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజకవర్గ వైస్సార్ తెలంగాణ పార్టీ కో-ఆర్డినేటర్ ఆదెర్ల శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేట జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ వైయస్సార్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షురాలు వైయస్ షర్మిల కు ప్రజలు అడుగడుగునా నీరాజనాలు పడుతున్నారని అన్నారు.

ఎన్నో కలలుగని పన్నెండు వందల మంది పైచిలుకు తెలంగాణ బిడ్డల ఆత్మబలిదానాలతో సాధించుకున్న తెలంగాణలో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రభుత్వం చేస్తున్న మోసాలను అరికట్టేందుకు వైయస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి రావాలని ఆ నాటి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన మరల తీసుకురావాలని వైయస్ షర్మిల కు ప్రజలు తమ కష్టాలను చెప్పుకుని బాధపడుతున్నారని అన్నారు.

రానున్న రోజుల్లో కెసిఆర్ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దించుతామని,ప్రతిన పూనుతున్నారని తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి రాజన్న సంక్షేమ పాలన అందించే లక్ష్యంతో సంక్షేమం, సమానత్వం,స్వయం సమృద్ధి ఎజెండాగా పార్టీ ఏర్పాటు చేసిన షర్మిల కు సూర్యాపేట జిల్లా ప్రజలు అండగా ఉండాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ బలోపేతానికి కృషిచేయాలని కోరారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

హైదరాబాద్ లో ఫుట్ బాల్ స్కేటింగ్ వరల్డ్ కప్ త్వరలో

Bhavani

గ్రామాలలో ఉపాధి పనుల ప్రారంభం

Satyam NEWS

తల్లి లాంటి వికలాంగ మహిళను చెరబట్టిన నీచుడు

Satyam NEWS

Leave a Comment