37.2 C
Hyderabad
May 6, 2024 13: 52 PM
Slider ప్రత్యేకం

ఏజెన్సీలో విజయవంతంగా నడుస్తున్న ఆదివాసీల బంద్

#AdivasiBundh

గిరిజన వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ నేడు ఆంధ్రా తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాలలో బంద్ జరుగుతున్నది.

నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ గ్రామాల్లో చేర్చాలని, పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయి పునరావాసం కల్పించాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు.

జీవో నెంబర్ 3 సాధన కమిటీ మేరకు నేడు పూర్తి స్థాయిలో  బంద్ ప్రారంభించారు మన్యంలో దుకాణాలు రవాణా సౌకర్యాలు నిలిపివేశారు.

జీవో నెంబర్ 3ని తక్షణమే పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు.

గిరిజనుల ఉద్యోగ హక్కును కాలరాసే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఉందని అందువల్ల తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం తక్షణమే రాజ్యాంగ సవరణ చేయాలని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. గిరిజన స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు కోరుతున్నారు.

Related posts

పట్టాలు ఉన్నవి మాత్రం కూల్చివేస్తారా?

Satyam NEWS

విజయవాడలోనే ఉండి ఎన్నికలు పర్యవేక్షించనున్న నిమ్మగడ్డ

Satyam NEWS

ఎట్టకేలకు కళ్లు తెరచిన తెలంగాణ సీఎం కేసీఆర్

Satyam NEWS

Leave a Comment