26.7 C
Hyderabad
May 3, 2024 07: 50 AM
Slider శ్రీకాకుళం

కేజీబీవీ అధ్యాపకులను వాడుకుని వదిలేసిన జగన్ ప్రభుత్వం

#KGBVTeachers

శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష ప్రాజెక్టు లో పని చేస్తున్న 20 మంది అధ్యాపకులను తొలగించడం అన్యాయమని శ్రీకాకుళం జిల్లా ఒప్పంద, పొరుగు సేవల సంఘ అధ్యక్షుడు సురేష్ బాబు అన్నారు.

పరీక్షల్లో మూల్యాంకనం, ఎన్నికలు వీధులను, బడి మానేసిన విద్యార్థులను తిరిగి బడిలో చేర్పించడం, కరోనా డ్యూటీలు లాంటి కీలక అంశాలలో ఈ అధ్యాపకులను ఉపయోగించుకుని ఇప్పుడు తీసేయడం అన్యాయమని ఆయన తెలిపారు.

 విధుల నుంచి  తొలగించిన కేజీబీవీ అధ్యాపకులు మంగళవారం శ్రీకాకుళం జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయము ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు.

ఈ ఆందోళనా కార్యక్రమానికి సంఘీభావం తెలుపుతూ వీరిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని సురేష్ బాబు డిమాండ్ చేశారు.

24 గంటలు  కళాశాలలో ఉండి విద్యార్థులకు అదనపు తరగతులు బోధించడం, ప్రాక్టికల్స్ నిర్వహించడం , విద్యార్థులకు పరీక్షలు పెట్టి వారి మేధస్సును పెంచడం, ప్రభుత్వం ప్రధాన పరీక్షల్లో పరిశీలన పర్యవేక్షించడం లాంటి కీలక విధులను వీరు నిర్వర్తించారని ఆయన అన్నారు.

అనేక కార్యక్రమాలను నిర్వహించిన వీరిని విధుల నుంచి అర్ధాంతరంగా తొలగించడం అన్యాయమని ఆయన తెలిపారు.

Related posts

బోట్ పెట్రోలింగ్ తో వలలను పట్టుకున్న కొల్లాపూర్ రేంజ్ అధికారి

Satyam NEWS

కష్టపడి పని చేసే వారికి బిజెపి గుర్తింపునిస్తుంది

Satyam NEWS

నల్ల బెలూన్లతో నిరసన

Murali Krishna

Leave a Comment