39.2 C
Hyderabad
May 3, 2024 14: 47 PM
Slider శ్రీకాకుళం

జాతీయ  సపక్ తక్రా పోటీలకు గిరిజన విద్యార్థులు

#TribalStudents

పదవ తరగతి చదువుతున్న శ్రీకాకుళం ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల విద్యార్ధి బిడ్డిక ఢిల్లేశ్వరరావు జాతీయ స్థాయి సపక్ తక్రా పోటీలకు ఎంపిక అయ్యాడు.

హర్యానా లో నిన్న ప్రారంభం అయిన జాతీయ స్థాయి ఉషు క్రీడాపోటీలు ఈ నెల 15 వరకు జరుగుతాయి. రాష్ట్రం తరుపున ఎంపికై అఖిల భారత స్థాయి క్రీడల్లో పాల్గొంటున్న విద్యార్ధులకు సీతంపేట సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు  అధికారి సి. హెచ్.శ్రీధర్ పదివేల  రూపాయల ఆర్ధిక సాయం అందిచారు.

పాఠశాల వ్యాయమ అధ్యాపకుడు  డాక్టర్.యం.వాసుదేవ ఆచారి ని ఆయన  అభినందించారు. రాష్ట్ర స్థాయి సపక్ తక్రా పోటీలకు ఇదే  ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల నుండి మరో  నలుగురు గిరిజన విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు  కమల, పాఠశాల ప్రధానోపాధ్యాయులు యం.శ్రీనివాస రావు, ఉపాధ్యాయ సిబ్బంది, ఒలింపిక్ అసోసియేషన్  కార్యదర్శి పి. సుందరరావు  పాఠశాల పి.డి.డాక్టర్.యం.వాసుదేవ ఆచారిని అభినందించారు.

Related posts

విశాఖ జిల్లా శనివాడలో బాలిక అదృశ్యం: ఆపై మృతదేహం లభ్యం

Satyam NEWS

ఉల్లి రైతుకు పొంచి ఉన్న ప్రమాదం

Satyam NEWS

వైయస్సార్ కు ఏలూరులో ఘన నివాళి

Satyam NEWS

Leave a Comment