28.7 C
Hyderabad
May 6, 2024 08: 57 AM
Slider ప్రత్యేకం

ఓటు వేయడానికి కాలినడన గిరిజన ఓటర్లు…!

#TribalsofVijayanagaram

పంచాయతీ ఎన్నికల ఓటింగ్ లో గిరిజనులు వ్యయప్రయాసలకు ఓర్చి కాలినడకన పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసి ఆదర్శంగా నిలిచారు.

విజయనగరం జిల్లా సాలురు మండలం ఒడిషా సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకుంది.

ఈ పంచాయతీ లో దిగువ రూడ, కాగరూడ, గాడివలస, కొంక మామిడి, గాలిపాడు గిరి శిఖర గ్రామాల నుంచి కొండలు, గుట్టలు, వాగులు దాటుకుంటూ కాలి నడక  సుమారు 8 కిలో మీటర్ల దూరంను 2.30 గంటల పాటు ప్రయాణించి దళాయి వలసలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఈ పోలింగ్ బూత్ లో మధ్యాహ్నం ఒంటి గంటన్నరకి 485 ఓట్లకు గాను 61 శాతంతో 297 పోలయ్యాయి. సంపంగి పాడు గ్రామం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో మధ్యాహ్నం 2 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది.

తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని  గిరి శిఖర గ్రామాల నుంచి ఓటర్లు  కాలి నడకన గిరిజన ఓటర్లు కిందికి దిగి వచ్చి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడంలో ఆదర్శంగా నిలిచారు.

Related posts

భారీ ఎత్తున అక్రమ కలప దుంగలు స్వాధీనం

Satyam NEWS

భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కన్నుమూత

Satyam NEWS

మ‌హారాజ ప్ర‌భుత్వ హాస్ప‌ట‌ల్లో ఘ‌ట‌న‌…వివ‌ర‌ణ ఇచ్చిన డాక్ట‌ర్లు…!

Satyam NEWS

Leave a Comment