40.2 C
Hyderabad
May 2, 2024 18: 22 PM
Slider విజయనగరం

మ‌హారాజ ప్ర‌భుత్వ హాస్ప‌ట‌ల్లో ఘ‌ట‌న‌…వివ‌ర‌ణ ఇచ్చిన డాక్ట‌ర్లు…!

#MaharajaHospital

రెండు రోజుల క్రితం విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలో ఉన్న మ‌హారాజ ప్ర‌భుత్వ వైద్య‌శాల‌లో జ‌రిగిన ఘ‌ట‌న‌పై హాస్ప‌ట‌ల్ అధికారులు మీడియా స‌మావేశం నిర్వ‌హించి మరీ వివ‌ర‌ణ ఇచ్చారు.

ఆక్సిజ‌న్ అంద‌క‌…క‌రోనా తో వచ్చిన పేషెంట్లు ప‌దుల సంఖ్య‌లో పేషెంట్లు మృతి చెందార‌న్న వార్త  జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపించింది.

దీనిపై జిల్లా ఎమ్మెల్యే,రాష్ట్ర డిప్యూటీ సీఎం పాముల పుష్ప‌శ్రీవాణి కూడా వివ‌ర‌ణ తో  కూడన వీడియో బైట్ ఇవ్వ‌డం దాన్ని ఉన్న ప‌ళంగా పౌర సంబంధాల శాఖ  మీడియాకు పంపించ‌డం జ‌రిగింది.

మీడియా ఛాన‌ళ్ల‌న్నీ త‌మ రేటింగ్ పెంచుకోవడం కోసం…ప్ర‌త్యేక బులిటెన్లు కూడా ఇచ్చాయి.

సీన్ క‌ట్ చేస్తే.కేవ‌లం ఇద్ద‌రు మాత్ర‌మే ఆక్సిజ‌న్ అంద‌క మృతి చెందిన‌ట్టు అప్పుడే ప‌లు ప‌త్రిక‌ల‌లో కొన్ని మీడియా ఛాన‌ళ్ల‌ల్స్ లో వ‌చ్చాయి.

అనంత‌రం యుద్ద ప్రాతిప‌దిక‌న క‌లెక్ట‌ర్, జేసీ అలాగే ఆర్డీఓ లు హుటాహుటిన ఆక్సిజ‌న్ సిలెండ‌ర్లు తెప్పించి హాస్ప‌ట‌ల్ ప్రాంగ‌ణంలో నిల్వ చేసి ఉంచ‌డంతో దాదాపు 4 గంట‌ల త‌ర్వాత రోగుల‌కు ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా అయ్యింది.

జిల్లా కేంద్ర హాస్ప‌ట‌ల్ లో జ‌రిగిన ఘ‌ట‌న రాష్ట్ర స్థాయిలో ర‌చ్చ ర‌చ్చ చేసింది.

వాస్త‌వానికి ఆక్సిజ‌న్ ప్ర‌తీ ఒక్క‌రికీ అవ‌స‌ర‌మ‌ని అందునా క‌రోనా వైర‌స్ సోకిన వారికి త‌ప్ప‌ని స‌రి వైద్య నిపుణులు తెగేసి చెబుతున్నారు కూడ‌.

దుర‌దృష్ట వ‌శాత్తు అనుకోకుండా మ‌హారాజా హాస్ప‌ట‌ల్ లోఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రా చేసే పైప్ లీక్ అవడంతో స‌ర‌ప‌రా ఆగిపోయి  ర‌చ్చ‌ర‌చ్చ అయింది.

తాజాగా హాస్ప‌ట‌ల్ లో జ‌రిగిన ఘ‌ట‌న‌పై మెడిక‌ల్ సూప‌రెంటెండెంట్ డా.ర‌విచంద్ర‌,ఆర్ఎంఓ గౌరీశంక‌ర్,ఆక్సిజ‌న్ స‌ర‌ఫ‌రాను ప‌ర్య‌వేక్షించే డాక్ట‌ర్లు సంయుక్తంగా మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

జ‌రిగిన ఘ‌ట‌న‌లో ఆక్సిజ‌న్ కొర‌త లేద‌ని..కాస్త మ‌ర‌మ్మ‌త్తు కార‌ణంగా కేవ‌లం 4 మాత్ర‌మే మృతి చెందార‌ని చెప్పారు.జిల్లా కేంద్ర హాస్ప‌ట‌లో  270 బెడ్ లు ఉన్నాయ‌ని అందులో క‌రోనా కు ప్ర‌త్యేకంగావ వార్డులు కేటాయించామ‌న్నారు.

రోగుల‌కు వైద్య చికిత్స‌లు చేసేంద‌కు డాక్ట‌ర్ల బృందం ఎల్ల‌ప్పుడూ సిద్దంగా ఉంద‌ని కాకపోతే హాస్ప‌ట‌లో ప‌ని చేసే ఉద్యోగుల‌కు జీతాలు అంద‌టం లేద‌ని ఆస‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తున్నామ‌న్నారు.

Related posts

కొల్లాపూర్ లో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి

Satyam NEWS

రూ.కోటి సాయం చేసిన తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య

Satyam NEWS

విజయ అంతిమ యాత్రకు హైదరాబాద్ తరలిరండి

Satyam NEWS

Leave a Comment