33.2 C
Hyderabad
May 15, 2024 19: 41 PM
Slider ముఖ్యంశాలు

కుల వివక్షత ఆయనను ప్రధాని కాకుండా అడ్డుకున్నది…!

కుల వివక్షత కారణంగా బాబూ జ‌గజ్జీవ‌న్ రామ్ ప్రధాని కాకుండా పోయింద‌ని విజ‌య‌న‌గ‌రంలో దళిత బహుజన శ్రామిక యూనియన్ పేర్కొంది.ఈ మేర‌కు దళిత బహుజన శ్రామిక యూనియన్ జిల్లా కార్యాలయ ఆవరణలో 115 జగజ్జీవన్ రామ్ జయంతి వేడుక ఘ‌నంగాజ‌రిగింది.

ఈ సందర్భంగా దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి చిట్టిబాబు మాట్లాడుతూ అప్పటికి దేశ ప్రధాని కావడానికి కావలసిన అన్ని అర్హతలు ఉన్నా కుల వివక్షత కారణంగా దేశ ప్రధాని కాకపోవడం విషాదకరమన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అమలు చేయడంలో బాబు జగజ్జీవన్ రామ్ ఎంతో కృషి శ్లాఘీనీయమని అన్నారు.

కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా వివిధ పదవుల్లో 30ఏళ్లు.50 ఏళ్ల పాటు ఎంపీగా పనిచేసి చరిత్రను సృష్టించిన నిస్వార్థ నాయకుడని అని కొనియాడారు.

బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం లో భూ పంపిణీ పథకాన్ని అమలు చేయడంలో కేంద్ర మంత్రిగా ఉండి బడుగు బలహీన వర్గాల కోసం చేసిన కృషి అభినందనీయమని చెప్పారు.

నేడు రిజర్వేషన్ హక్కులను పరిరక్షించడం ద్వారా ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం ద్వారా ఆయన ఆశయాలు కొనసాగించిన వారము అవుతామని ప్ర‌తిన‌బూనారు.

ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కార్యదర్శి రాయి ఈశ్వర రావు,జిల్లా ఉపాధ్యక్షుడు యందవ పోలయ్య, జిల్లా మాజీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు గద్దిపాం సుందరరావు మాదిగ, డి.బి.ఎస్.యు చీపురుపల్లి నియోజకవర్గ , మొండూరి రాజు,యు.రాము, దళిత మహిళా నాయకురాలు పీరుబండి సత్యవతి,కోరుకొండ వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related posts

రుణ మాఫి అమలు చేయాలి

Bhavani

వనపర్తి జిల్లాలోవ్యాక్సినేషన్ పూర్తి చేయాలి

Satyam NEWS

శివోహం: సంగమేశ్వరాలయంలో ఎంపి బిబి పాటిల్ పూజలు

Satyam NEWS

Leave a Comment