39.2 C
Hyderabad
May 3, 2024 14: 24 PM
Slider వరంగల్

రుణ మాఫి అమలు చేయాలి

#Loan waiver

తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా రైతు లకు హామీనిచ్చిన లక్ష రూపాయల రుణా మాఫిని వెంటనే అమలు చేయాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు గడ్డిపాటి రాజారావు డిమాండ్ చేశారు.

తెలంగాణ రైతు సంఘం అధ్వర్యంలో గార్ల డిప్యూటీ తహశీల్దారు వీరన్న కు రైతులతో కలిసి వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు లకు లక్ష రూపాయలు రుణాలు మాఫి చేస్తామని వాగ్దానం చేసి సంవత్సరాలు గడుస్తున్న నేటి వరకు అమలు చేయలేదని,రైతు లకు కొత్త రుణాలు ఇవ్వకుండా బ్యాంకులో నానా ఇబ్బందులు గురి చేస్తున్నాయన్నారు.

రైతు లకు లక్ష రూపాయలు రుణా మాఫి చేస్తామని చెప్పి 25 వేల రూపాయలు మాత్రమే మాఫి చేశారని, 25 వేల రుణాల మాఫి లో పి ఎ సి ఎస్ బ్యాంక్ లో 806 మంది రైతు లను అర్హుల జాబితాను చూపేడుతుండగా, 492 మందికి మాత్రమే రుణాలు మాఫి అయ్యాయని ఆవేదన వెలిబుచ్చారు.50 వేల రూపాయల లోపు రుణాలు మాఫి అయిన వారిలో 1205 మంది ఉండగా 685 మందికి మాత్రమే రుణాలు మాఫి అయిందన్నారు.

వర్షాకాలం సమీపిస్తున్న తరుణంలో కౌలు రైతులకు రైతు బంధు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు భాగం లోకేశ్వరావు, వాంకుడోత్ మోహన్ ,వాంకుడోత్ శంకర్, లక్ష్మి, విమల, శ్రీనివాస్ ,మహేశ్వరరావు, వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

Related posts

బూత్ స్థాయిలో విస్తృత ప్రచారం చేయాలి

Bhavani

సుబ్బారావు గుప్తాతో రాజీపడిన మంత్రి బాలినేని

Satyam NEWS

పులివెందులలో ఘనంగా వైఎస్ వివేకా వర్ధంతి

Satyam NEWS

Leave a Comment