37.2 C
Hyderabad
April 30, 2024 11: 50 AM
Slider ఖమ్మం

అమరవీరుల స్తూపం వద్ద సిపిఐ నేతల నివాళి

#Martyrs Stupa

తెలంగాణ రాష్ట్ర పదవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత కమ్యూనిస్టు పార్టీ ఖమ్మంజిల్లా సమితి ఆధ్వర్యంలో మయూరిసెంటర్ లోని అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా

తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం, అమరుల త్యాగాలు రాష్ట్ర అవతరణ సహా పలు విషయాలను కమ్యూనిస్టు పార్టీ నాయకులు మననం చేసుకున్నారు. అంతకు ముందు సిపిఐ జిల్లా కార్యాలయం వద్ద జాతీయ పతాకాన్ని సిపిఐ జిల్లా

కార్యదర్శి పోటు ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన అనేక దశాబ్దాల కల అని రాష్ట్ర సాధన కోసం అనేక మంది వీరులు ఆత్మ బలిదానాలు చేశారన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ

సాధనలో కీలక భూమిక పోషించిందన్నారు. తెలంగాణకు మద్దతు పలికిన తొలి జాతీయ పార్టీగా వినతికెక్కడమే గాక తెలంగాణ సాధన కోసం జరిగిన అనేక పోరాటాల్లో సిపిఐ ముందుండి పోరాడిందన్నారు. అసమానతలు లేని

తెలంగాణను సిపిఐ ఆశిస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజలు సర్వతోముఖాభివృద్ధి సాధించినప్పుడే తెలంగాణ సాధనకు సార్థకత చేకూరుతుందని ప్రసాద్ తెలిపారు. పాలకులు తెలంగాణ రాష్ట్రంలోని సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం ప్రత్యేక

కార్యాచరణ రూపొందించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సమితి సభ్యులు జమ్ముల జితేందర్ రెడ్డి, జానిమియా, పోటు కళావతి, సిహెచ్ సీతామహాలక్ష్మీ, తాటి వెంకటేశ్వరరావు, మేకల శ్రీనివాసరావు, రావి శివరామకృష్ణ,

పగడాల మల్లేష్, కార్పొరేటర్ చామకూరి వెంకటనారాయణ, గాదె లక్ష్మీ నారాయణ, తాటి నిర్మల, యానాలి సాంబశివరెడ్డి, నానబాల రామకృష్ణ, ఇటికాల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

గ్రామ పంచాయితీ నిధులను చోరీ చేసిన ప్రభుత్వం

Satyam NEWS

పోలీసులు చేసిన సేవ ఏంటో…కేంద్రానికి చెప్పిన క‌రోనా మ‌హిళా వారియ‌ర్

Satyam NEWS

మన హక్కులను మనమే కాపాడుకోవాలి

Satyam NEWS

Leave a Comment