40.2 C
Hyderabad
April 26, 2024 11: 02 AM
Slider విజయనగరం

పోలీసులు చేసిన సేవ ఏంటో…కేంద్రానికి చెప్పిన క‌రోనా మ‌హిళా వారియ‌ర్

#rajakumariIPS

ఆమెలో ఓ ధీన వ‌నిత క‌నిపిస్తుంది. కాదు..కాదు ఆమెనే ఓ ధీర‌శాలి..ఓ ధైర్య‌శాలి, ఎలాంటి విప‌త్తునైనా,ఎలాంటి స‌మ‌స్య‌నైనా ధైర్యంగా ఎదుర్కొనే దీశాలి..! తాను క‌ష్టాల్లో ఉన్నా ఎదుట వారిని ఆదుకోవాల‌న్న ధృడ సంకల్పం ఆమెది.

వారు ,వీరు అని తేడా లేకుండా మ‌హ‌మ్మారి క‌రోనా ఎంద‌రినో పొట్టుకుంది. మ‌రెంద‌రో బతుకు జీవుడా అని బ‌తికి బ‌ట్ట క‌ట్టారు కూడ‌. అలాంటి భ‌యంక‌ర‌మైన మహ‌మ్మారి క‌రోనా సోకి దాదాపు 20 రోజుల‌కు పైగా బంగ్లా క్వారైంట‌న్ లో ఉండి..త‌గ్గిన మ‌రుక్ష‌ణం…తిరిగి య‌ధావిదంగా ప్ర‌జ‌ల‌కు ఆ మ‌హ‌మ్మారి ప‌ట్ల అవ‌గాహ‌న‌,మ‌నోధైర్యం చెప్పేందుకు అను క్ష‌ణం రోడ్డు మీదే ఉండే పోలీస్ ఉన్న‌తాధికారిణి గురించి నేను మీకు ఇంత ఉపోద్ఘాతం ఇచ్చింది.

ఆమెనే విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ రాజ‌కుమారీ. గుంటూరు జిల్లాకు చెందిన ఆమె గతంలో న‌ల్గొండ‌, ఆదిలాబాద్ లో ప‌ని చేసి విజ‌య‌వాడ‌,రాజ‌మ‌హేంద్ర వ‌రం వచ్చారు. 2019 జూన్ 14 న విజ‌య‌న‌గ‌రం జిల్లా ఎస్పీ గా చార్జ్ తీసుకున్నారు.  వ‌చ్చిన కొద్ది రోజుల‌లోనే జిల్లా పై అవ‌గాహ‌న పెంచుకున్నారు. ఇక ఆరు నెల‌లు తిరిగాయో లేదో…క‌రోనా మ‌హ‌మ్మారి పుణ్య‌మా…త‌న ప‌నితనం ఏంటో చేసి చూపించారు.

అదీ సిబ్బందికి చెప్ప‌డం, ఆదేశాలు ఇవ్వ‌డం కాదు..స్వ‌యంగా ఒకే ఒక్క ఫోన్ కాల్ తో బీ.రాజ‌కుమారీ ప‌ని త‌నం ఏంటో..అర్ధ‌రాత్రి వేళ‌..అదీ వ‌ల‌స‌కార్మికుల అర్ధాక‌లిని తీర్చి నిరూపించుకున్నారు. ఇక అక్క‌డ నుంచీ వ‌చ్చిన,వ‌స్తున్న సవాళ్ల‌ను, స‌మ‌స్య‌ల‌ను ఓ ఝాన్సీ ల‌క్ష్మీ భాయి,ఓ రుద్ర‌మ దేవీలా ధైర్యంగా ఎదుర్కొని జిల్లా పోలీస్ శాఖ ప‌నిత‌నం ఏంటో…యావ‌త్ ప్రపంచానికే చూసి చూపెట్టారు…ఎస్పీ రాజ‌కుమారీ.

2020 లోవ‌చ్చిన క‌రోనా ప‌స్ట్ వేవ్ లో దాదాపు మూడు నెల‌ల పాటు జిల్లాను గ్రీన్ జోన్ లో ఉంచినందుకు గానూ…క‌రోనా మ‌హ‌మ్మారి తో అటు శాఖా సిబ్బందిని వారి కుబుంటాల‌ను  శాఖ ద్వారా  అందుతున్న ప్ర‌భుత్వ  ప‌థ‌కాల‌ను మంజూరుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన అటు ప్ర‌జ‌ల‌కు ఇటు మాతృశాఖ‌కు ఓ త‌ల్లిగా కాపాడింద‌నే చెప్పారు.

ఈ రెండేళ్ల‌లో  675 మంది మ‌హిళా సంర‌క్ష‌ణ పోలీస్, స్టూడెంట్ పోలీస్ క్యాడెట్, పోలీస్ సేవాద‌ళ్, పోలీస్ మిత్ర‌, ఆత్మీయ వీడ్కోలు, స్పంద‌న‌, రిసెప్ష‌నిస్ట్ సెంట‌ర్లు, గ్రీవియెన్స్,చేయూత‌,శౌర్య‌,స్నైప‌ర్ టీమ్, సంజీవ‌ని,ఆప‌రేష‌న్ ముస్కాన్ ,మీ ప‌ల్లెలో మీ పోలీసులు,మీ భ‌ద్ర‌తే,మా బాధ్య‌త అంటూ ఇలా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి…చివ‌ర‌కు ఈ ఏడాది జ‌న‌వ‌రిలో  కేంద్ర  ప‌ర్య‌వర‌ణ శాఖా మంత్రి ప్ర‌కాష్ జ‌వ‌దేక‌ర్ చేతుల మీదుగా క‌రోనా మ‌హిళా వారియ‌ర్ అవార్డును అందుకున్నారు…ఎస్పీ రాజ‌కుమారీ.

చివ‌ర‌కు జిల్లాలో ఈ రెండేళ్లలోమ‌రీ ముఖ్యంగా క‌రోనా స‌మ‌యంలో ఎస్పీ రాజ‌కుమారీ చేసిన సేవ‌ల‌ను కేంద్రం గుర్తించి జాతీయ స్థాయి అవార్డు ఇవ్వ‌డంతో..ఇక లాభం లేద‌నుకుని ఏపీ రాష్ట్ర పోలీస్ బాస్ డీజీపీ  మార్చి 24న క‌రోనా మహిళా వారియర్ అవార్డును రాష్ట్ర స్థాయిలో బ‌హుక‌రించారు.

ఇక బ‌దిలీ అయ్యే ప‌రిస్థితులు క‌నిపించ‌డంతో..ఆమె కోరుకున్న విధంగానే రాష్ట్ర ప్ర‌భుత్వం స‌రిగ్గా మ‌హిళా దినోత్స‌వం రోజునే  డిప్యూటీ ఇన్ స్పెక్ట‌ర్ ఆఫ్ పోలీసు(డీఐజీ) గా ప‌దోన్న‌తి క‌ల్పిస్తూ ఉత్త‌ర్వులు ఇవ్వ‌డం విశేష‌మేన‌ని అంటోంది..స‌త్యం న్యూస్.నెట్.

ఏదైనా స్త్రీ త‌ల‌చుకుంటే…ఏమైనా చేయ‌గ‌ల‌ద‌ని మాట‌ల‌లోకాక చేత‌ల‌లో చేసి చూపించారు…ఎస్పీ రాజ‌కుమారీ.జిల్లా ఎస్పీగా బాద్య‌త‌లు తీసుకుని రెండేళ్లు పూర్తియ‌న సంద‌ర్బంగా హేట్పాస్ చెబుతోంది…స‌త్యం న్యూస్.నెట్.

ఎం.భరత్ కుమార్. సత్యం న్యూస్

Related posts

వీడ్ని మనిషి అందామా? వేరే పేరు పెడదామా?

Satyam NEWS

పుణ్యధాత్రి

Satyam NEWS

ప్రజా సమస్యల పరిష్కార వేదికగా స్పందన కార్యక్రమం

Bhavani

Leave a Comment