40.2 C
Hyderabad
April 26, 2024 14: 57 PM
Slider మహబూబ్ నగర్

డప్పు రమేష్ జీవిత త్యాగం వెలకట్టలేనిది

#dappuramesh

నమ్మిన సిద్ధాంతం కోసం పోరాటం చేసి జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు డప్పు రమేష్ అని తెలంగాణ దళిత దండు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు బచ్చలకూర బాలరాజు అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లోని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర కామ్రేడ్ డప్పు రమేష్ కు  దళిత సంఘాలు ఘనంగా నివాళి అర్పించింది. ఈ కార్యక్రమంలో బచ్చలకూర బాలరాజు మాట్లాడుతూ 40 సంవత్సరాలు నమ్మిన సిద్ధాంతం కోసం ఆయన పోరాటం చేశారని అన్నారు.

ప్రజలను చైతన్యం చేసిన పాటలు రాసిన దళిత చైతన్య కెరటం డప్పు రమేష్ అని మాలల చైతన్య సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మద్యాల రాoదాసు అన్నారు. కుడికిళ్ల  జంగం రాము మాట్లాడుతూ వీరుడు రమేశ్ మరణం ఈ సమాజానికి తీరని లోటు అని అన్నారు.

రమేష్ వివిధ అణగారిన వర్గాలకు పోరాట మర్గాన్ని చూపిన వేగు చుక్క అని అన్నారు. తెలంగాణ దండోరా జిల్లా గౌరవ అధ్యక్షులు  డీకే మాదిగ మాట్లాడుతూ  దళిత పులుల  పాట ద్వారా దళిత సమాజాని మేలుకొలిపిన రమేష్ అన్న లేకపోవడం సమాజానికి తీరని లోటు అన్నారు. ఈ కార్యక్రమంలో లో తెలంగాణ దళిత దండు నియోజకవర్గ ఇన్చార్జి జిలకర కృపాకర్  తెలంగాణ దండోరా తాలూకా ఇన్చార్జి మల్లెల వెంకట స్వామి  తదితరులు పాల్గొన్నారు.

Related posts

పాకిస్తాన్ పత్రికలకు లడ్డూలా దొరికిన అర్నబ్ గోస్వామి కేసు

Satyam NEWS

సీఎం జగన్ సొంత జిల్లాలో వైసీపీ నేతల మట్టి మాఫియా

Satyam NEWS

నిన్న రోజా… నేడు ఆనం :సీరియల్ అవమానాలు

Satyam NEWS

Leave a Comment