37.2 C
Hyderabad
May 2, 2024 12: 07 PM
Slider విజయనగరం

విజయనగరం లో నేషనల్ యూనిటీ డే: పటేల్ కు నివాళులు..!

#deepikaips

“నేషనల్ యూనిటీ డే” సందర్భంగా విజయనగరం జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో “రన్ ఫర్ యూనిటీ” కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎం.దీపిక ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రన్ ను జెండా ప్రారంభించిన అనంతరం పీటీసీ ఆవరణలో ఉన్న సర్ధార్ విగ్రహానికి పూలమాలలు వేసారు…ఎస్పీ దీపికా. అంతకుముందు యూనిటీ రన్ లో పాల్గొన్న పోలీసు అధికారులు, సిబ్బంది, యువతతో దేశ అంతర్గత భద్రతకు కృషి చేస్తామని ఎస్పీ ప్రతిజ్ఞ చేయించి, యూనిటీ రన్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ దీపిక మాట్లాడుతూ – దేశ ఐక్యతకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు విశేషంగా కృషి చేసి, దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు అనేక సంస్థానాలను ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. దేశానికి పటేల్ గారు అందించిన సేవలను స్ఫూర్తిగా తీసుకొని, దేశ ఐక్యత, సౌభ్రాత్రత్వం, అంతర్గత భద్రతకు ప్రతీ ఒక్కరూ కట్టుబడి ఉండాలని జిల్లా ఎస్పీ ఎం.దీపిక పిలుపు నిచ్చారు.

ఈ కార్యక్రమంలో విజయనగరం డీఎస్పీ అనిల్ పులిపాటి, దిశా డీఎస్పీ  టి.త్రినాథ్, ట్రాఫిక్ డీఎస్పీ  ఎల్.మోహనరావు, ఎఆర్ డీఎస్పీ  ఎల్.శేషాద్రి, సీఐలు  జే.మురళి,  జి.రాంబాబు,  లక్ష్మణరావు, మంగవేణి, ఆర్ ఐలు నాగేశ్వరరావు, చిరంజీవి, ఈశ్వరరావు,  మరియన్ రాజు, కుమార్,  రమణమూర్తి, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ విక్రమాదిత్య ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

పట్టణాలకు దీటుగా పల్లెల అభివృద్ధే మా ధ్యేయం

Satyam NEWS

కర్నూలులో ప్రియురాలుని చంపి ప్రియుడు ఆత్మహత్య

Satyam NEWS

మనిషి మారితేనే మనుగడ

Satyam NEWS

Leave a Comment