26.7 C
Hyderabad
May 3, 2024 08: 12 AM
Slider నల్గొండ

ఆటో కార్మికులకు ప్రభుత్వం సాయం అందించి ఆదుకోవాలి

#autodrivers

సిఐటియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి

ఒక్కరోజు కార్మికుడు ఆటో తీయకుండా ఉండచ్చేమో గాని పెట్రోల్,డిజిల్ రేట్లు మాత్రం పెంచడం మాత్రం ఒక్క రోజు కూడా ఆగడం లేదని,ఇలాంటి ప్రభుత్వం కేంద్రంలో మునుపెన్నడూ లేదని సి ఐ టి యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి ఎద్దేవా చేశారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని పాత బస్టాండ్ ఆవరణలో సి ఐ టి యు అనుబంధ ఆటో కార్మికుల కమిటీ సమావేశంలో శీతల రోషపతి మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గ ప్రజలు,కార్మికులు మనశ్శాంతిగా, ప్రశాంతంగా లేరని అన్నారు.ప్రతిరోజు పెట్రోల్,డీజిల్ ధరలు పెంచుతూ ఆటో కార్మిక జీవనం అతలాకుతలమై ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డారని అన్నారు.

మరొకపక్క రైతులకు వ్యవసాయ మూడు చట్టాలు తీసుకొచ్చి రైతుల్ని సుమారు సంవత్సరం నుంచి రోడ్ల పాలు చేశారని,కార్మిక చట్టాల సవరణ పేరుతో నాలుగు కార్మిక కోడ్ లను తీసుకొచ్చి కార్మికులుని వెట్టి చాకిరి చేయించాలని చూస్తోందని ఆరోపించారు.గత సంవత్సరం,ఈ సంవత్సరం లాక్ డౌన్  సమయంలో ప్రైవేటు ఆటో ఫైనాన్స్ ఆగిన బకాయిలు ఇప్పుడు కట్టాలని కార్మికులను ఇబ్బంది పెడుతున్నారని,అందుకు ఆటో కార్మికులు ఆందోళన చెందుతున్నారని అన్నారు.ఇలాంటి కష్ట సమయంలో ఆటో కార్మికులకు ఆర్థికంగా ప్రతి ఒక్కరికి 50,000 రూపాయలు వడ్డీ లేని ఋణాలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని కోరారు.డీజిల్,పెట్రోల్ ధరలు తగ్గించాలని,ఆటో కార్మికులకు సబ్సిడీ మీద డీజిల్,పెట్రోల్ ఇవ్వాలని ఏదో రకంగా కార్మికులని ఆదుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.రాంబాబు ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్ష్య, కార్యదర్శులు పిట్ల బాలు,శీతల చందు, లిక్కి లింగయ్య,గణపతి,బిక్షం,రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

సర్పంచ్‌ వ్యవస్థ నిర్వీర్యం చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం

Satyam NEWS

నేటి నుండి ప్రైవేట్ మెడికల్ షాప్ వర్కర్లకు బూస్టర్ టీకా

Satyam NEWS

ఉత్కంఠ రేకెత్తిస్తున్న బిగ్ బాస్ ప్రోమో

Satyam NEWS

Leave a Comment