32.7 C
Hyderabad
April 27, 2024 00: 43 AM
Slider నల్గొండ

పట్టణాలకు దీటుగా పల్లెల అభివృద్ధే మా ధ్యేయం

#MLAChirumarthy

నకిరేకల్  నియోజకవర్గం చిట్యాల మండలంలోని ఏపూరు,గుండ్రంపల్లి,సుంకనపెల్లి,వెల్మినేడు గ్రామాలలో గురువారం నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పల్లె ప్రకృతి వనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పట్టణాలకు దీటుగా పల్లెలను అభివృద్ధి చేయడంలో ముందంజలో ఉందని తెలిపారు.

ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాల కార్యక్రమం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అని అన్నారు. పల్లె ప్రకృతి వనం ద్వారా గ్రామంలోని మంచి వాతావరణం ఏర్పడుతుంది అంతేకాకుండా గ్రామస్తులకు యువకులకు విద్యార్థులకు మంచి ప్రశాంతత దొరుకుతుందని తెలిపారు.

మండలంలోని కోటి 80 లక్షల తో పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. గ్రామస్తులు పల్లె ప్రకృతి వనాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకుని అందరూ వినియోగించుకోవాలని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాల తో పాటు ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్, స్మశాన వాటిక, సిసి రోడ్లు, మంచినీటి సౌకర్యం, అర్హులైన ప్రతి ఒక్కరికి రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ,ఆసరా పింఛన్లు, అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లోకి ప్రతి గ్రామానికి అందిస్తుంది.

దేశంలో ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధిని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొలను సునీత వెంకటేష్ గౌడ్, జెడ్ పి టి సి సుంకరి ధనమ్మ యాదగిరి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జడల అది మల్లయ్య యాదవ్,

డి సి బి సి వైస్ చైర్మన్ ఏసి రెడ్డి దయాకర్ రెడ్డి, ఏపూరు సర్పంచ్ పాలెం మాధవి మల్లేష్, గుండ్రంపల్లి సర్పంచ్ రత్నం పుష్ప నరసింహ,సుంకనపెల్లి సర్పంచ్ కక్కిరేణి బొందయ్య ,వెల్మినేడు సర్పంచ్ దేశ బోయిన మల్లమ్మ పాపయ్య, ఎంపీటీసీలు మర్రి వెంకటేశం, దేశబోయిన స్వరూప రాణి,

దేవరపల్లి సత్తిరెడ్డి, సింగిల్విండో చైర్మన్ రుద్రారం బిక్షపతి, నాయకులు కొలను సతీష్ గౌడ్, ఆవుల ఐలయ్య, మానవుని శివ శంకర్ గౌడ్, సుధాకర్ రెడ్డి మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related posts

2న టీడీపీలో చేరబోతున్న వైసీపీ ఎంపి

Satyam NEWS

రిజిస్ట్రేషన్లపై ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధన ఎత్తివేత హ‌ర్ష‌ణీయం

Sub Editor

రైతుల అభ్యున్నతి కోసమే నూతన రెవిన్యూ చట్టం

Sub Editor

Leave a Comment