42.2 C
Hyderabad
May 3, 2024 17: 48 PM
Slider ముఖ్యంశాలు

సామాన్య ప్రజల పై అధిక భారం మోపుతున్న జగన్ ప్రభుత్వం

#chadalawda

ధరల పెరుగుదలపై తెలుగుదేశం పార్టీ కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేపట్టింది. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం లోని విప్పర్ల, రెడ్డిపాలెం, దాసరిపాలెం, మర్రిచెట్టు పాలెం గ్రామాలలో తెలుగుదేశం పార్టీ నేతలతో కలిసి రాత్రి కొవ్వొత్తుల నిరసన ప్రదర్శనలో నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో 6 సార్లు విద్యుత్ చార్జీలను పెంచిందని తెలిపారు.

విద్యుత్ ఛార్జీలు పెంచడంతో పాటు రైతుల మోటార్లకు మీటర్లు బిగించి రైతు మెడకు ఉరితాడు బిగించారని ఆయన అన్నారు. అదే విధంగా సర్దుబాటు చార్జీల పేరుతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారాన్ని మోపారని డా౹౹చదలవాడ అన్నారు. నాణ్యమైన విద్యుత్ ఇస్తామని హామీలు ఇచ్చి, కరెంటు కోతలు పెంచిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి కే దక్కుతుందని ఆయన అన్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎరువులు, పురుగు మందుల ధరలు భారీగా పెంచడంతో రైతన్నకు సాగు కష్టాలు ప్రారంభమయ్యాయి. రెండున్నర ఏళ్ళ వైసీపీ పాలన లో ల్యాండ్, సాండ్, వైన్, మైన్ మాఫియా రాజ్యమేలుతోంది అన్నారు. పెంచిన విద్యుత్ చార్జీలను, సర్దుబాటు పేరుతో పెరిగిన విద్యుత్ రేట్లను  సామాన్యుడి పై పడుతున్న అదనపు భారాన్ని ప్రజలలోకి తీసుకువెళ్లాలని టీడీపీ నాయకులను, కార్యకర్తలను డా౹౹చదలవాడ కోరారు.

ఈ కార్యక్రమంలో వనిపెంట పిచ్చిరెడ్డి, గంగారపు సైదులు రెడ్డి, గంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, వనిపెంట బ్రహ్మారెడ్డి, వనిపెంట సుబ్బారెడ్డి, గంగిరెడ్డి సుబ్బారెడ్డి, వనిపెంట రామకృష్ణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మస్తానయ్య, శ్రీనివాస రావు, ముత్తయ్య, గంట చెన్నయ్య, రవి, స్వర్ణ రమేష్, వేములయ్య, ఆదినారాయణ,సుబ్బారావు, బ్రహ్మయ్య, మాదిరెడ్డి వెంకట కృష్ణారెడ్డి ,కోడూరు గంగిరెడ్డి, రాజాల అంకిరెడ్డి, సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య, మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, పులకురి జగ్గయ్య, ఇమ్మడిశెట్టి కాశయ్య, కుమ్మెత కోటిరెడ్డి, రామీశెట్టి కోటయ్య, యంపాటి కోటి రెడ్డి, పోతిరెడ్డి అంజి రెడ్డి, మన్నన్ షరీఫ్, బడే బాబు, మబు, సాయి, హరికృష్ణ, రమేష్ రొంపిచర్ల మండల, గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

కేజీబీవీలో మెరిసిన ఆణిముత్యాలు: సత్తాచాటిన అనాధ బాలికలు

Satyam NEWS

తిరుమల తిరుపతి ఈవోగా జవహర్ రెడ్డి

Satyam NEWS

పచ్చని చెట్లు మానవ మనుగడకు మెట్లు

Satyam NEWS

Leave a Comment