29.7 C
Hyderabad
May 6, 2024 05: 16 AM
Slider ముఖ్యంశాలు

హుజురాబాద్ లో 99 శాతం మంది టీఆర్ఎస్ నేతలు మాతోనే

#gangula kamalakar

టీఆర్ఎస్ నేతలు అమ్ముడుపోతారని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ వాఖ్యానించడం బాధగా ఉందని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కౌన్సిలర్లు, ఛైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ పార్టీతోనే ఉన్నామని స్వచ్చందంగా పత్రికాముఖంగా వెల్లడించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. టీఆర్ఎస్ పార్టీలో వర్గాలు ఉండవు, అందరూ కేసీఆర్ వర్గమేనని మంత్రి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీ క్యాడర్ అమ్ముడుపోయేవారు కాదని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న హుజురాబాద్ నియెజకవర్గంలోని మండలాల వారీగా ప్రజాప్రతినిధులు వారి అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. కేవలం ఈటెల చేసిన ఒత్తిడి, బెదిరింపులతోనే తొలుత ఆయనకు మద్దతుగా మాట్లాడామని, కానీ మాకు ఓటేసిన ప్రజలు నిలదీయడంతో కన్నతల్లిలాంటి పార్టీతోనే ఉండాలని నిర్ణయించామని ముక్తకంఠంతో తెలియజేశారు.

ప్రపంచం మెత్తం సంక్షోభంలో ఉంటే తెలంగాణ పచ్చగా కలకలలాడుతుందని, రికార్డు సమయంలో ప్రాజెక్టులు పూర్తిచేసి జలాలు అందించిన కేసీఆర్ వెంటే ఉంటామని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ సాధించుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివ్రుద్ది కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు తెలియజేశారు.

తొలుత ఈటెల రాజెందర్ ను మంత్రివర్గం నుండి భర్తరఫ్ చేసిన వెంటనే సంపూర్ణ సమాచారం లేకపోవడంతో ఆయనకు మద్దతు తెలిపామని కానీ ఆయన చేసిన అక్రమాలు, భూదందాలతో అసహ్యం వేసిందని, తప్పుచేసిన వారు సొంతవారైనా తెగించి చర్యలు తీసుకున్న కేసీఆర్ పట్ల, పార్టీ పట్ల మరింత కమిట్మెంట్ పెరిగిందని, ఎన్ని కష్టాలు ఎదురైనా సంపూర్ణ మద్దతు ఇచ్చిన పార్టీని వీడేదే లేదన్నారు.

పార్టీపై అసభ్యంగా, అసత్యాలు సోషల్ మిడియా వేదికగా ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజాప్రతినధులు మీడియా ముఖంగా సూచించారు.

నేడు కరీంనగర్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, కరీంనగర్ మేయర్ వై సునీల్ రావు,  సుడా చైర్మన్ జీవీ రామకృష్ణ రావు, వకులభరణం కృష్ణ మోహన్ రావు, పిర్యాల రవీందర్ రావు, డిప్యూటీ మేయర్ చల్లా స్వరూప హరిశంకర్,  హుజురాబాద్ నియోజకవర్గానికి చెందిన జెడ్పిటిసిలు, ఎంపీపీలు, వీణవంక జెడ్పిటిసి ,ఎంపీపీ లు ఎంపీటీసీలు ,సర్పంచ్ లు, కౌన్సిలర్లు తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

కేసీఆర్‌కు క‌మీష‌న్ల‌పైనే ధ్యాస బీజేపీ

Sub Editor

కంటైన్ మెంట్ జోన్ లో మేడ్చల్ జిల్లా కలెక్టర్ పర్యటన

Satyam NEWS

నటుడు కమల్ హాసన్ కు తీవ్ర అస్వస్థత

Murali Krishna

Leave a Comment