38.2 C
Hyderabad
May 2, 2024 20: 55 PM
Slider నిజామాబాద్

తెలంగాణ ప్రజల గుండె చప్పుడు టీఆర్ఎస్

#MLCKavita

తెలంగాణ ప్రజల గుండె చప్పుడు టీఆర్ఎస్ పార్టీ అన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నిజామాబాద్ లో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత, టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ,  టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుండి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను దేశవ్యాప్తంగా తెలియజేస్తూ, నిరంతం ప్రజల కోసం పనిచేస్తున్నామని ఎమ్మెల్సీ కవిత తెలిపారు.

ప్రజల ఆశీస్సులతో రెండు సార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్, తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తోందన్నారు ఎమ్మెల్సీ కవిత. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాలు నిర్మితమవుతున్నాయన్న ఎమ్మెల్సీ కవిత, ప్రతి గ్రామంలోని కార్యకర్తలకు అండగా నిలుస్తామన్నారు.  కార్యాలయాల్లో ఉండే సిబ్బంది,  ఇన్సూరెన్స్ లాంటి అనేక అంశాల్లో కార్యకర్తలకు సహాయసహకారాలు అందిస్తారని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.  అంతేకాదు దేశంలోని బలమైన ప్రాంతీయ పార్టీల్లో ఒకటిగా టీఆర్ఎస్ నిలిచిందన్నారు ఎమ్మెల్సీ కవిత.

ఉదయం  క్యాంపు కార్యాలయంలో అనేకమంది కార్యకర్తలు, ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ కవిత గారిని కలిసారు. ప్రజల నుండి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించిన ఎమ్మెల్సీ కవిత, అండగా ఉంటానని హామీ ఇచ్చారు. నిజామాబాద్ రూరల్, బోర్గాం పి.గ్రామంలో ఎమ్మెల్యే జాజిరెడ్డి గోవర్ధన్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్లు ఉమారాణి, సాయరాం, జర్నలిస్టు బాలులను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు.

అన్నదానం అభినందనీయం…

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత భోజన వితరణ ముగింపు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. కరోనా మహమ్మారి సమయంలో ఎమ్మెల్యే గణేష్ గుప్తా చేపట్టిన ఉచిత అన్నదానం ఎంతోమందికి ఉపయోగపడిందన్న ఎమ్మెల్సీ కవిత, మరికొద్ది రోజులు కరోనా పట్ల అప్రమత్తత అవసరమన్నారు. అనంతరం ఫులాంగ్ చౌరస్తా లోని పులాంగ్ పార్క్ ని ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, మేయర్ నీతూ కిరణ్, మాజీ ఎమ్మెల్సీ నర్సారెడ్డి, కార్పోరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

పేదల ముంగిట్లోకి ఉచితంగా కార్పొరేట్ వైద్యం

Satyam NEWS

ముందు నుండి వైసిపి, వెనుక నుండి బిజేపి వెన్నుపోటు

Satyam NEWS

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దు

Murali Krishna

Leave a Comment